Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరించి హాస్పిటల్‌లో ఘనంగా ప్రపంచ కిడ్నీ డే వేడుకలు.. కిడ్నీ సంరక్షణపై అవగాహన..!

విరించి ఆసుపత్రి ఇప్పటికే అనేక సంక్లిష్టమైన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. తల్లి నుండి కొడుకుకు, భార్య నుండి భర్తకు ABO అననుకూల మూత్రపిండ మార్పిడి, బయాప్సీ-నిరూపితమైన త్రోంబోటిక్ మైక్రోఅంజియోపతితో ఉన్న రోగికి మూత్రపిండ మార్పిడి వంటివి ఇందులో ఉన్నాయి. భారతదేశంలోనే మొదటిసారిగా ఒకే సమయంలో కిడ్నీ, హృదయ అవయవ మార్పిడి చేసిన ఘనత విరించి హాస్పిటల్ సొంతం.

విరించి హాస్పిటల్‌లో ఘనంగా ప్రపంచ కిడ్నీ డే వేడుకలు..  కిడ్నీ సంరక్షణపై అవగాహన..!
Virinchi Peoples Hospital World Kidney Day
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 14, 2025 | 12:29 PM

అన్ని విభాగాల సేవలు అందించడంలో హైదరాబాద్‌లోని విరించి పీపుల్స్ హాస్పిటల్ ముందుంటోంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారి కుటుంబాలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నెఫ్రాలజీ విభాగం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా వైద్యులు వివరించారు. మూత్రపిండాల ఆరోగ్య పని తీరును రోగులందరినీ అడిగి తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తల గురించి అందరికీ అవగాహన కల్పించారు. నెఫ్రాలజీ రంగంలో విరించి హాస్పిటల్ చేస్తున్న కృషిని వివరించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్‌లో కిడ్నీ రోగులకు అందిస్తున్న ప్రత్యేక చికిత్సల గురించి వైద్యులు వివరించారు. డాక్టర్ కె.ఎస్ నాయక్, డాక్టర్ నవీన్ కుమార్ మాట్టేవాడ, డాక్టర్ రవి కుమార్ వంటి అనుభవజ్ఞులైన వైద్యుల నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం పటిష్టంగా ఉందని తెలిపారు. కిడ్నీ సంరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ, అద్భుతమైన ఫలితాలను అందిస్తోందని తెలిపారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని, అందుకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను తాము అందిస్తున్నామని విరించి పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మూత్రపిండాల సంరక్షణకు, చికిత్సకు విరించి హాస్పిటల్ ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. డయాలసిస్ అవసరాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.

పెరిటోనియల్ డయాలసిస్ (పిడి) విషయంలో అంతర్జాతీయంగా విరించి హాస్పిటల్ ముందంజలో ఉందని తెలిపారు. ఇంటి వద్దనే డయాలసిస్ చేసుకునేలా రోగులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కాథెటర్ వేసిన 12 గంటల్లోపే పెరిటోనియల్ డయాలసిస్ ఇంటి వద్దనే చేసుకునేలా చేయడంలో విరించి ముందుందని తెలిపారు. ఈ పద్ధతిని ఇటీవల జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ నెఫ్రాలజీ 2025లో ప్రదర్శించామని తెలిపారు.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరాష్ట్ర, ఇంటర్ హాస్పిటల్ స్వాప్ కిడ్నీ మార్పిడి చేయడం ద్వారా విరించి హాస్పిటల్ చరిత్ర సృష్టించిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.. జీవన దాతలు దొరకని రోగులకు, మరొక కుటుంబంతో దాతలను మార్పిడి చేసుకునే అవకాశం ఈ పద్ధతి ద్వారా సులభతరం అవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా స్వాప్ మార్పిడి కార్యక్రమాన్ని విస్తరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఐసోట్) తో కలిసి పనిచేస్తున్నట్లు విరించి ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

విరించి ఆసుపత్రి ఇప్పటికే అనేక సంక్లిష్టమైన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. తల్లి నుండి కొడుకుకు, భార్య నుండి భర్తకు ABO అననుకూల మూత్రపిండ మార్పిడి, బయాప్సీ-నిరూపితమైన త్రోంబోటిక్ మైక్రోఅంజియోపతితో ఉన్న రోగికి మూత్రపిండ మార్పిడి వంటివి ఇందులో ఉన్నాయి. భారతదేశంలోనే మొదటిసారిగా ఒకే సమయంలో కిడ్నీ, హృదయ అవయవ మార్పిడి. ఒకే దాత నుండి కాలేయం, తర్వాత మూత్రపిండం మార్పిడి వంటి అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని విరించి పీపుల్స్ హాస్పిటల్ తెలిపింది.+

వీడియో చూడండి.. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..