Viral Video: వర్షంలో తడిచిపోతున్న పిల్లి పిల్ల.. సాయం చేసి తన ఇంటికి తీసుకొచ్చిన కుక్క.. ఆకట్టుకున్న వీడియో
ప్రకృతిలో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జాతి వైరం మరచి స్నేహ ధర్మాన్ని పాటించే జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పిల్లి పిల్ల, కుక్కకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు.

ప్రపంచంలో దయ గల మనుషులకు కొదవు లేదు. అదే సమయంలో జాతి వైరాన్ని మరచి తోటి జీవి పట్ల దయాని జాలిని చూపించే జంతువులూ కూడా తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వర్షంలో తడచి పోతున్న ఓ చిన్న పిల్లి పిల్లను కుక్క రక్షించింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది. X లో ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ అనే ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ క్లిప్ జంతువుల మధ్య విడదీయరాని బంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
ఒక మహిళ తీసిన వీడియోను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. ఒక పెంపుడు కుక్క.. వీధిలో ఉన్న చిన్న పిల్లి పిల్లను తమ ఇంటికి సున్నితంగా తీసుకువచ్చింది. వర్షం కురుస్తుంది.. చిన్న పిల్లి పిల్ల తడిచిపోతుంది.. అప్పుడు ఒక పెంపుడు కుక్క.. ఆ పిల్లి పిల్లను తమ ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఎంతో సహనం చూపించింది. శ్రద్ధ పెట్టింది. కుక్క.. పిల్లి పిల్లను ఎక్కడా టచ్ చేయకుండా తనని అనుసరించమని ఆ పిల్లి పిల్లను ప్రోత్సహిస్తుంది.. అప్పుడు కుక్క ఉపయోగించిన హావభావాలు అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. వర్షంలో కనిపిస్తున్న ఈ అద్భుతమైన ప్రేమ హృదయాన్ని హత్తుకుంటుంది. వీడియో చూడండి:
చిన్న పిల్లి పిల్లను కాపాడుతున్న కుక్క పిల్ల …
A dog saves a small stray kitten by taking it home… pic.twitter.com/xXPw3hYajM
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 21, 2025
5
ఈ వీడియో తో పాటు ఒక క్యాప్షన్ కూడా జత చేశారు. ఒక కుక్క దారి తప్పిన చిన్న పిల్లి పిల్లను ఇంటికి తీసుకెల్లి కాపాడింది. ఈ క్లిప్ వీక్షకుల్లో వివిధ రకాల భావోద్వేగ ప్రతిచర్యలను రేకెత్తించింది. “నేను ఈ రోజు చూసిన అత్యంత స్వచ్ఛమైన విషయం ఇదే.. జంతువుల్లో అంత దయగల హృదయాలు ఉంటాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు “ఇది చూసిన తర్వాత తన హృదయం నిండిపోయింది, జంతువులు నిజంగా ప్రేమ, సంరక్షణకు అర్థాన్ని మనకు నేర్పుతాయి” అని అన్నారు.
కొంతమంది వీక్షకులు కుక్క రక్షణాత్మక స్వభావాన్ని ప్రశంసించారు, “కుక్క పిల్లిని జాగ్రత్తగా చూసుకున్న విధానం చాలా ముద్దుగా ఉందని ఒకరు.. అసలు ఈ కుక్కలాగా ఎక్కువ మంది ఉంటే బాగుండని అని మరికొందరు కామెంట్ చేశారు. “ఈ వీడియో జంతువుల మంచితనంపై తన విశ్వాసాన్ని పునరుద్ధరించింది. అవి నిజంగా మన ప్రాణ స్నేహితులు” అని ఒకరు అన్నారు. “గందరగోళంతో నిండిన ప్రపంచంలో, ఇది మనకు అవసరమైన కంటెంట్” అని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..