SBI Personal Loan: అతి తక్కువ వడ్డీ.. జీరో ప్రాసెసింగ్ ఫీజు.. పర్సనల్ లోన్లపై ఎస్‌బీఐ సూపర్ ఆఫర్..
ఇవి అసురక్షిత లోన్లు. కేవలం వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగానే వీటిని మంజూరు చేసేస్తారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ప్రముఖ రుణదాత, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పర్సనల్ లోన్లపై అదిరే ఆఫర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత రుణాలను కోరుకునే వ్యక్తుల కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది.

పర్సనల్ లోన్లకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది జనాలకు బాగా ఉపకరిస్తోంది. ఎవరి వద్దకు వెళ్లకుండా.. ఆన్‌లైన్‌లోనే సులభంగా వాటిని పొందుకునే వీలుండటంతో ఎక్కువశాతం మంది వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ లోన్లపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. మిగిలిన ఇతర లోన్లతో పోల్చుకుంటే పర్సనల్ లోన్లలోనే ఎక్కువ వడ్డీ రేటు ఉంటాయి. ఎందుకంటే ఇవి అసురక్షిత లోన్లు. కేవలం వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగానే వీటిని మంజూరు చేసేస్తారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ప్రముఖ రుణదాత, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పర్సనల్ లోన్లపై అదిరే ఆఫర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత రుణాలను కోరుకునే వ్యక్తుల కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. రుణాలను సులభంగా, మరింత సరసమైనదిగా చేస్తుంది. లోన్లపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీకు మంజూరయ్యే లోన్‌మొత్తంపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదన్నమాట.
ఫెస్టివ్ ధమాకా పేరుతో..
ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు రహిత వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఫెస్టివ్ ధమాకా పేరుతో ఈ ఆఫర్ అందిస్తోంది. 2024, మార్చి 31లోపు తీసుకునే రుణాలపై మాత్రమే ఈ లోన్లు మంజూరవుతాయి. రూ. 20లక్షల లోపు రుణాలపైమాత్రమే ఇది వరిస్తుంది. సాధారణంగా ఎస్‌బీఐ పర్సనల్ లోన్లపై 1.5శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఇది లేకుండానే వినియోగదారులు లోన్లు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది.
అర్హతలు ఇవి..
మీరు ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, వ్యక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం..
కనీస నెలవారీ ఆదాయం: ఆఫర్‌ను పొందేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి కనీస నెలవారీ ఆదాయం రూ. 15,000 ఉండాలి.
వయస్సు ప్రమాణాలు: వ్యక్తి వయస్సు 21 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఉపాధి: వ్యక్తికి కేంద్ర/రాష్ట్ర/క్వాసీ ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, కార్పొరేట్లు లేదా విద్యా సంస్థల ద్వారా ఉద్యోగం ఉండాలి. అలాగే కనీసం ఒక సంవత్సరం సర్వీస్ కాలం ఉండాలి.
ఈఎంఐ/ఎన్‌ఎంఐ నిష్పత్తి: నిష్పత్తి తప్పనిసరిగా 50 శాతం కంటే తక్కువగా ఉండాలి.
అప్పు మొత్తం: రుణం మొత్తం రూ. 24,000 నుంచి రూ. 20,00,000 లేదా వ్యక్తుల నికర నెలవారీ ఆదాయం కంటే 24 రెట్లు వరకూ తీసుకోవచ్చు.
లోన్ ఫీచర్లు ఇవి..
- ఈ రుణం తక్కువ వడ్డీ రేట్లతో వస్తుంది.
- రెండో రుణం కోసం ఎంపిక, అదనపు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది.
- కనీస డాక్యుమెంటేషన్ అవసరం, అప్లికేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
- 20 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








