AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

SBI Life - Smart Scholar Plus: ఇది స్థిరమైన వడ్డీ ఇచ్చే సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాదు. మార్కెట్ శాతాన్ని బట్టి చివరి మెచ్యూరిటీ మొత్తం మారతూ ఉంటుంది. అందువల్ల ఐదేళ్లు మాత్రమే కట్టి రూ.45 లక్షలు పొందాలనే లక్ష్యం ఉన్నవారు..

SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!
Sbi Life Smart Scholar Plus
Subhash Goud
|

Updated on: Sep 05, 2026 | 8:15 AM

Share

SBI Life – Smart Scholar Plus: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్’. పిల్లల ఆర్థిక రణక్ష కల్పించడంలో భాగంగా మార్కెట్‌ లింక్డ్‌ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకే సమయంలో ఇన్సూరెన్స్ కవరేజ్, మార్కెట్ ఆధారిత పెట్టుబడి రాబడులను అందిస్తుందని చెబుతున్నారు. పాలసీ కాలవ్యవధిలో ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులు ఏదైనా కారణంగా మృతి చెందినా లేదా వైకల్యం పొందినా, కుటుంబానికి వెంటనే ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించనుంది. మిగిలిన భవిష్యత్ ప్రీమియంలను ఎస్బీఐ లైఫ్ సంస్థే చెల్లింపులు చేస్తుంది.

SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి?

ఇక పాలసీ ముగిసిన తర్వాత నిర్ణీత ఫండ్ పిల్లలకు అందుతుంది. ఈ స్కీమ్‌ మరో ముఖ్యమైన సదుపాయం ఏంటంటే.. తల్లిదండ్రులు సుదీర్ఘ కాలం పాటు కాకుండా కేవలం 5 సంవత్సరాల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. 5 ఏళ్ల పాటు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన అనంతరం ఆ పెట్టుబడిని 15 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు ఫండ్లలో కొనసాగనివ్వవచ్చని బ్యాంకు పేర్కొంటోంది.

ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ప్లస్ ఓ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అందుకే ఇందులో మీరు చెల్లించే సొమ్ము ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడతారు. దీర్ఘకాలంలోమార్కెట్ సాధించే వార్షిక వృద్ధి ఆధారంగా ఫండ్ విలువ పెరుగుతుంది.

ప్రతి ఏటా రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు జమ చేస్తే..

ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఐదు సంవత్సరాల పాటు జమ చేసినట్లయితే 12-15 శాతం వార్షిక మార్కెట్ రాబడి లభిస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.45 లక్షల వరకు అదే అవకాశం ఉంటుందిని చెబుతోంది. ఈ స్కీమ్‌లో ప్రీమియం చెల్లింపుల కోసం సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. అలాగే క్రమం తప్పకుండా లాయల్టీ అడిషన్స్ అందించడం ద్వారా ఫండ్ విలువ కాలక్రమేణా మరింత పెరుగనుంది. పాలసీ ప్రారంభమైన ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన అనంతరం అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పాక్షికంగా విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఇందులో రిస్క్ ఉంటుందని గమనించాలి.

ఇది స్థిరమైన వడ్డీ ఇచ్చే సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాదు. మార్కెట్ శాతాన్ని బట్టి చివరి మెచ్యూరిటీ మొత్తం మారతూ ఉంటుంది. అందువల్ల ఐదేళ్లు మాత్రమే కట్టి రూ.45 లక్షలు పొందాలనే లక్ష్యం ఉన్నవారు.. తాము ఎంత ప్రీమియం చెల్లించాలి, ఎంత కాలం ఉంచాలి, ఎంత శాతం మార్కెట్ రాబడి అవసరమో మీ ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ లేదా బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us