SBI Doorstep Banking: ఇంటి వద్దకే ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు.. ఎలా పొందాలో తెలుసా?

బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఇంటి వద్దకు వచ్చి కొన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ. ఎస్‌బీఐ అందిస్తోన్న డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సేవల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Doorstep Banking: ఇంటి వద్దకే ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు.. ఎలా పొందాలో తెలుసా?
Sbi Doorstep Banking
Follow us
Venkata Chari

|

Updated on: Jun 23, 2021 | 9:41 PM

SBI Doorstep Banking: కాలం మారుతోంది. అన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే.. మన ఇంటివద్దకే వస్తున్నాయి. ఇలా బ్యాకింగ్ సేవలు ఉంటే బాగుండు అనుకుంటున్నారా..! అయితే మీకోసమే ఈ న్యూస్ తీసుకొచ్చాం. బ్యాంకులో పని ఉండి వెళ్తే బారెడు లైన్‌లు కనిపిస్తాయి. పొద్దునెప్పుడో వెళ్లి లైన్‌లో నిలబడితే కానీ పని అవ్వదు. అయితే, ఆన్‌లైన్ బ్యాకింగ్ వచ్చినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు తప్పినా.. కొన్ని సర్వీసుల కోసం బ్యాంక్ ‌కు వెళ్లాల్సిందే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మన ఇంటి వద్దకే వచ్చి కొన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ. ఇప్పటికే కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్త ఐడియాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి. ఎస్‌బీఐ అందిస్తోన్న డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సేవల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ అందించే సేవల వివరాలు.. నగదును జమ చేయడం టీడీఎస్‌/ఫారం 16 అందజేత నగదు ఉపసంహరణ చెక్‌బుక్ అందజేత చెక్కు డిపాజిట్ స్టేట్‌మెంట్ల అందజేత డిమాండ్‌ డ్రాఫ్ట్‌ చేయడం లైఫ్‌ సర్టిఫికెట్‌ పికప్‌ ఫారం 15హెచ్‌ అందజేత టర్మ్‌ డిపాజిట్‌ రశీదులు

వీటితోపాటు కేవైసీ పత్రాలను బ్యాంకులో సమర్పించాలంటే బ్యాంకు కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేసేందుకు బ్యాంకు నియమించిన సిబ్బందితో మన ఇంటి వద్దే ఇలాంటి సౌకర్యాలను ఎస్‌బీఐ అందిస్తోంది.

నగదు లావాదేవీలూ.. నగదు విత్‌డ్రా సదుపాయాన్ని పొందేందుకు ఖాతాదారులు బ్యాంకు ఖాతాను ఆధార్‌ లేదా డెబిట్‌ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటోంది. లావాదేవీల పరిమితిని కనిష్ఠంగా రూ.1,000.. గరిష్ఠంగా రూ.20,000లుగా చేసుకోవచ్చు. అయితే వీటికి సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ లావాదేవీలకు రూ.60+జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ.100+జీఎస్టీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సేవలు ఎలా పొందాలంటే.. ఇంటి వద్ద సేవలు పొందాలంటే 18001037188, 180012113721 నెంబర్లకు కాల్ చేయాలి. మరోపద్ధతిలో ఎస్‌బీఐ అధికారిక యాప్‌, డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ యాప్‌ తోపాటు వెబ్‌సైట్లోగానీ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఖాతాదారులు తమ హోం బ్రాంచికి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అయితే బ్యాంక్ ఖాతాకు మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారులు కోరిన సేవలను మీ లావాదేవీ జరిగిన తేదీ మరుసటి రోజుల్లో బ్యాంక్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి సేవలను అందిస్తారు.

ఈ సేవలు పొందాలంటే అర్హులు.. సీనియర్‌ సిటిజన్లు (70 ఏళ్ల వయసు పైబడిన వారు), దివ్యాంగులు ఈ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు అర్హులు. కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులు, హోమ్‌ బ్రాంచీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈసేవలు అందుతాయి. అయితే, మైనర్లు, ఉమ్మడి ఖాతాదారులకు మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ పేర్కొంది.

Also Read:

Liter Diesel Cost Rs 100 : ఈ నగరాలలో లీటర్ డీజిల్ 100 రూపాయల పై మాటే..! వేర్వేరు పట్టణాల్లో వేర్వేరు రేట్లు..

Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ప్రయత్నం..! మొబైల్ నంబర్ ఆధారిత చెల్లింపులు ప్రారంభం..?

EPF accounts: మీరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేసినట్లయితే.. ఖచ్చితంగా ఈ పని చేయండి.. లేకపోతే మీరు డబ్బును తీసుకోలేరు..

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!