SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ సమయాల్లో బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎప్పుడంటే.?
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో లైట్ సేవలు..

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది.
”జూలై 16వ తేదీ శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచిపోతాయని బ్యాంక్ పేర్కొంది. ఈ సమయంలో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయొద్దని సూచించింది” ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిని ఖాతాదారులు గమనించాలని.. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో తమకు సహకరించాలని ఎస్‌బీఐ అభ్యర్ధించింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021
Also Read:
పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!
ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!
