AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: పేటీఎంకు బిగ్‌ షాక్‌..! లైసెన్స్‌ రద్దు.. కారణాలు ఇవే!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బిఐ భారీ ఎదురుదెబ్బ తగిలించింది. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్‌బిఐ కఠిన ఆంక్షలు విధించింది. ఇది బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. డిజిటల్ చెల్లింపులు, లక్షలాది కస్టమర్ల నిధుల భద్రత, బ్యాంక్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

RBI: పేటీఎంకు బిగ్‌ షాక్‌..! లైసెన్స్‌ రద్దు.. కారణాలు ఇవే!
Paytm Payments Bank
SN Pasha
|

Updated on: Apr 24, 2026 | 10:04 PM

Share

డిజిటల్ పేమెంట్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. RBI తీసుకున్న తాజా నిర్ణయాలతో ఆ బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ఆర్‌బిఐ, పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించింది. సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ బ్యాంక్ నిర్వహణ, ఆపరేషన్లు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా లేవని తేలింది.

అలాగే పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌కు సంబంధించిన కీలక షరతులను పాటించడంలో విఫలమైందని ఆర్‌బిఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తూ, మరిన్ని పరిమితులు విధించారు. ఇప్పటికే గతంలో కూడా ఆర్‌బిఐ ఈ బ్యాంక్‌పై పలు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 2022 మార్చి 11 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిలిపివేయడం, అలాగే ఖాతాల్లో డిపాజిట్లు, వాలెట్ టాప్-అప్‌లు వంటి సేవలపై పరిమితులు విధించడం జరిగింది.

తాజా నిర్ణయాలతో ఈ ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఈ పరిణామాలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ఈ బ్యాంక్ సేవలను వినియోగిస్తున్న లక్షలాది కస్టమర్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల నిధుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్‌బిఐ తగిన చర్యలు తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్