SBI: రుణ గ్రహీతలకు షాకిచ్చిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆ వడ్డీ రేట్లు పెంపు

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని..

SBI: రుణ గ్రహీతలకు షాకిచ్చిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆ వడ్డీ రేట్లు పెంపు
మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి రూ. 206.50 కట్ అయ్యిందా..? ఈ మొత్తం మీ ఒక్కరికే జరిగిందని అనుకుంటే పొరపడినట్లే. ఇలా మీకు మాత్రమే కాదు.. చాలా మంది కస్టమర్లకు జరిగింది.
Follow us
Subhash Goud

|

Updated on: Feb 17, 2023 | 4:20 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను పెంచింది. ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం మేరకు పెంచింది. అలాగే వివిధ కాలపరిమితి డిపాజిట్‌ రేట్లను కూడా 0.05 శాతం నుంచి 0.25 శాతం మేరకు పెంచింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. కనీస వడ్డీరేటు 7.95 శాతం అవుతుంది. ఈ పెంపు హోమ్‌, ఆటో రుణాల కస్టమర్లకు ఏ మాత్రం భారం ఉండదని తెలిపింది. ఈ రేట్లన్నీ తక్షణం అమలులోకి వచ్చాయి.

ఎంపీఎల్‌ఆర్‌ కాలపరిమిధి వడ్డీ రేట్లు:

  • 1-3 నెలలు 8.10 శాతం
  • 6 నెలలు 8.40 శాతం
  • ఏడాది 8.50 శాతం
  • రెండేళ్లు 8.60 శాతం
  • మూడేళ్లు 8.70 శాతం

డిపాజిట్‌ రేట్లు

రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ వడ్డీ రేటు 2.70 శాతం ఉండగా, రూ,10 కోట్ల కన్నా పైబడితే 3 శాతం, రూ.2 కోట్లు లోపు డిపాజిట్లకు విభిన్న కాలపరిమితి రేట్లు ఇలా ఉన్నాయి.

  • 1-2 సంవత్సరాలు 6.80 శాతం
  • 2-3 సంవత్సరాలు 7 శాతం
  • 3 సంవత్సరాలు పైన 6.50 శాతం

రూ.2 కోట్లు పైబడిన బల్క్‌ డిపాజిట్‌ రేట్లకు వడ్డీ రేటును 0.25 శాతం నుంచి 0.50 శాతం మేరకు పెంచింది. వివిధ కాల పరిమితుల ఆధారంగా ఈ రేటు 4.75 శాతం నుంచి 6 శాతం మధ్యన ఉంటుందని బ్యాంకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఎంసీఎల్‌ఆర్‌ అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బ్యాంకులు రుణాలను అందించడానికి ఇది అంతర్గత సూచన రేటు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే