SBI alert: SBI ఖాతాదరులకు ముఖ్య సూచన.. ఆ సమయంలో సేవలకు అంతరాయం..

SBI తమ ఖాతాదరులకు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. తమ కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది.

SBI alert: SBI ఖాతాదరులకు ముఖ్య సూచన.. ఆ సమయంలో సేవలకు అంతరాయం..
Sbi
Follow us

|

Updated on: Jul 16, 2021 | 11:50 AM

SBI తమ ఖాతాదరులకు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. తమ కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు తెలియ జేస్తుంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 16) అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది. జూన్‌ 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనోలైట్‌, యూపీఐ సేవలకు కొద్దిపాటి బ్రేక్ వస్తుందని తెలిపింది.

ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి మెసేజ్‌లు, అలర్ట్‌లపై క్లిక్‌ చేయొద్దని సూచించింది. ఆ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కష్టమర్లంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

సైబర్ నేరస్థుల బారిన పడకుండా వినియోగదారులకు ఎస్బీఐ కొన్ని చిట్కాలను గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సూచించింది. KYC నవీకరణ కోసం బ్యాంక్ ఏ కస్టమర్‌కి ఎటువంటి సందేశాలను పంపదని గుర్తు ఉంచుకోండి. మీ మొబైల్ నంబర్, రహస్య డేటాను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.

సమయం: జూన్‌ 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు

ఇవి కూడా చదవండి Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ

Funny virul video: ఓ మహిళ నీటిలోకి దిగుతుండగా.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే.. వీడియో చూసిన తర్వాత మీరు కూడా..

Viral Video: ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్