ఇక ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డులు..!

దేశీయంగా పేమెంట్స్‌ గేట్‌వే నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందడుగు వేశాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు కేవలం రూపే కార్డులను డెబిట్ కార్డులుగా విడుదల చేశారు. అయితే ఇందులో మరో ముందడుగు వేసింది ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI). ఇక వినియోగదారులకు రూపే క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో యూఎస్‌ పేమెంట్స్‌ గేట్‌వేలైన వీసా, మాస్టర్‌కార్డ్‌లు హవా నడుస్తున్న నేపథ్యంలో […]

ఇక ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డులు..!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 11:38 AM

దేశీయంగా పేమెంట్స్‌ గేట్‌వే నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందడుగు వేశాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు కేవలం రూపే కార్డులను డెబిట్ కార్డులుగా విడుదల చేశారు. అయితే ఇందులో మరో ముందడుగు వేసింది ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI). ఇక వినియోగదారులకు రూపే క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో యూఎస్‌ పేమెంట్స్‌ గేట్‌వేలైన వీసా, మాస్టర్‌కార్డ్‌లు హవా నడుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ దిశగా అడుగులు వేయనుంది. రూపేను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. దీని ద్వారా రిటైల్‌గా చెల్లింపులు, లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే త్వరలోనే రూపే ఆధారిత క్రెడిట్‌కార్డును తీసుకొస్తామని.. దీని అనుమతులకు సంబంధించి, ఎన్‌పీసీఐ వద్ద చివరి దశలో ఉన్నాయని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్దయాళ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఒక్కసారి ఎన్‌పీసీఐ నుంచి తుది అనుమతులు వస్తే.. ఇక క్రెడిట్‌కార్డును వెంటనే ప్రారంభిస్తామన్నారు. భారత మార్కెట్లో రుపే క్రెడిట్‌ కార్డు ప్రాముఖ్యత సంపాదించుకుంటుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రూపే కార్డు భారత్‌తో పాటు సింగపూర్‌, భూటాన్‌, యూఏఈ, బహ్రెయిన్‌, మాల్దీవుల్లో వాడుకోవచ్చని తెలిపారు. ఎస్‌బీఐ కార్డుకు జూలై నెలాఖరుకు 90 లక్షల మంది వినియోగదారులున్నారని.. మార్కెట్లో తమ కార్డు 17.9 శాతం వాటా కలిగి ఉందని పేర్కొన్నారు.