Save Income Tax: ఆ ఖర్చులతోనే ఆదాయపు పన్ను ఆదా.. పన్ను ఆదా చేయడానికి నిపుణులు టిప్స్ ఏంటంటే..?

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు ముంచుకొస్తుంది. గడువులోగా తమ ఐటీఆర్ను దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు హడావుడిగా ఉన్నారు. అయితే జులై 31 తర్వాత కూడా జరిమానాతో ఫైల్ చేయవచ్చని తెలిసినా జరిమానా పడకుండా ఉండేందుకు రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో సామాన్య పన్ను చెల్లింపులు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.

Save Income Tax: ఆ ఖర్చులతోనే ఆదాయపు పన్ను ఆదా.. పన్ను ఆదా చేయడానికి నిపుణులు టిప్స్ ఏంటంటే..?
Income Tax
Follow us

|

Updated on: Jul 07, 2024 | 4:45 PM

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు ముంచుకొస్తుంది. గడువులోగా తమ ఐటీఆర్ను దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు హడావుడిగా ఉన్నారు. అయితే జులై 31 తర్వాత కూడా జరిమానాతో ఫైల్ చేయవచ్చని తెలిసినా జరిమానా పడకుండా ఉండేందుకు రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో సామాన్య పన్ను చెల్లింపులు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అయితే ఆదాయపు పన్నులను ఆదా చేయడానికి చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి. ఇవి 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకరాం వస్తాయి.  కాబట్టి పెట్టుబడి లేకుండా పన్నులను ఆదా చేయడంలో ప్రయోజనకరంగా ఉండే విధానాలను ఓ సారి తెలుసుకుందాం. 

పిల్లల ట్యూషన్ ఫీజు

తల్లిదండ్రులు భారతదేశంలోని ఏదైనా విద్యా సంస్థకు చెల్లించే ట్యూషన్ ఫీజు కోసం సంవత్సరానికి రూ. 1,50,000 వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఇద్దరు పిల్లల పూర్తి కాల విద్యకు వర్తిస్తుంది. ప్లే-స్కూల్, ప్రీ-నర్సరీ, నర్సరీ తరగతులు చదివే వారి తల్లిదండ్రులు కూడా మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే స్కూల్ డెవలప్మెంట్ ఫీజులు, విరాళాల వంటి ఖర్చులు మినహాయిపును చేయబడవు.

విద్యా రుణం

సెక్షన్ 80ఈ ఉన్నత విద్య కోసం విద్యా రుణాలపై చెల్లించే వడ్డీకి తగ్గింపులను అనుమతిస్తుంది. ఈ మినహాయింపుపై గరిష్ట పరిమితి లేదు. అలాగే తిరిగి చెల్లింపు ప్రారంభమైన సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు దీనిని క్లెయిమ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు

సెక్షన్ 80జీ ఆమోదించబడిన స్వచ్చంద సంస్థలకు చేసిన విరాళాలకు తగ్గింపులను అందిస్తుంది. సంస్థపై ఆధారపడి విరాళం మొత్తంలో మినహాయింపు 50 శాతం లేదా 100 శాతం కావచ్చు. తమ పన్ను రిటర్ను ఫైల్ చేసేటప్పుడు, దాతలు తప్పనిసరిగా గ్రహీత పేరు, పాన్, చిరునామా, విరాళం మొత్తాన్ని అందించాలి.

మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు

సెక్షన్ 80డీ తనకు, జీవిత భాగస్వామికి, పిల్లలు, తల్లిదండ్రులకు వైద్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంలకు తగ్గింపులను అనుమతిస్తుంది. వ్యక్తులు తమకు, వారి కుటుంబానికి చెల్లించిన ప్రీమియంల కోసం సంవత్సరానికి రూ. 25,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా రూ. 50,000 వరకు మినహాయింపు లభిస్తుంది.

హెూమ్ లోన్ 

సెక్షన్ 24(బి) వ్యక్తులు స్వీయ-ఆక్రమిత ఆస్తుల కోసం గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా ప్రిన్సిపల్ రీపేమెంట్ సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంటుంది. ఈ ప్రయోజనాలు పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అద్దె చెల్లింపు

అద్దె ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు సెక్షన్ 10 ప్రకారం చెల్లించిన అద్దెకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మినహాయింపు మొత్తం వ్యక్తి జీతం, నివాస నగరంపై ఆధారపడి ఉంటుంది. అయితే అద్దె చెల్లింపుదారులు యజమాని పాన్ నెంబర్ అందించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..