Summer Season: ఈ సారి జోరుగా ఎండలు ఉన్నా తగ్గిన ఏసీ, ఫ్రిడ్జ్‌ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..

సాధారణంగా ఎండాకాలం అంటే ఏప్రిల్ నెల నుంచి మొదలవుతుంది. దాదాపుగా జూన్ వరకూ కొనసాగుతుంది. మధ్యలో ఒక నెలరోజులు పీక్ స్థాయిలో ఎండలు మండుతాయి. ఎండలు పెరగడం స్టార్ట్ కాగానే.. కూలర్లు.. ఏసీలు.. అమ్మకాలు ఊపందుకుంటాయి. అయితే, ఈ సంవత్సరం మాత్రం అంతా విరుద్ధంగా జరిగింది. సరిగ్గా..

Summer Season: ఈ సారి జోరుగా ఎండలు ఉన్నా తగ్గిన ఏసీ, ఫ్రిడ్జ్‌ల అమ్మకాలు.. కారణం ఏంటంటే..
Acs And Refrigerators
Follow us
Subhash Goud

|

Updated on: Jun 06, 2023 | 5:38 PM

సాధారణంగా ఎండాకాలం అంటే ఏప్రిల్ నెల నుంచి మొదలవుతుంది. దాదాపుగా జూన్ వరకూ కొనసాగుతుంది. మధ్యలో ఒక నెలరోజులు పీక్ స్థాయిలో ఎండలు మండుతాయి. ఎండలు పెరగడం స్టార్ట్ కాగానే.. కూలర్లు.. ఏసీలు.. అమ్మకాలు ఊపందుకుంటాయి. అయితే, ఈ సంవత్సరం మాత్రం అంతా విరుద్ధంగా జరిగింది. సరిగ్గా ఎండలు గట్టిగా ఉంది ఏసీల అమ్మకాలు పెరగాల్సిన సమయంలో వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాలతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ ల అమ్మకాలు పెరగడం మాట అటుంచి పడిపోయాయి. అవును ఈ సంవత్సరం రిఫ్రిజిరేషన్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీల అమ్మకాలు వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావం అయ్యాయి. పది శాతం అమ్మకాలు పెరుగుతాయని ఆశించిన ఆ కంపెనీలకు 35 నుంచి 40 శాతం అమ్మకాలు తగ్గడం షాక్ ఇచ్చింది. మార్చి, ఏప్రిల్ తరువాత మే నెలలో కూడా వర్షాలు కురిశాయి. మరీ ముఖ్యంగా మే నెలలో వాతావరణం చల్లగా మారిపోయింది. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ లకు డిమాండ్ తగ్గిపోయింది.

ఇవొక్కటే కాదు ఐస్క్రీం.. కూల్ డ్రింక్స్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. వీటికి తోడుగా టాల్కమ్ పౌడర్.. సబ్బుల అమ్మకాలు కూడా ప్రభావితం అయ్యాయి. మార్చి.. మే నెలల మధ్య కూల్ డ్రింక్స్ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 25% కంటే ఎక్కువ తగ్గాయి. ఐస్ క్రీమ్ అమ్మకాలు 38%, సబ్బుల అమ్మకాలు 8% తగ్గాయి. ఏసీ విక్రయాలు అత్యధికంగా 40% క్షీణించాయి. ఈ విషయాన్నిరిటైల్ సేల్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ బిజోమ్ వెల్లడించింది.

ఫ్రిజ్, కూలర్, శీతల పానీయాలు, టాల్కమ్ పౌడర్ వంటి ప్రొడక్ట్ సేల్స్ లో సింహా భాగం అంటే 50-60% మార్చి 1 – జూన్ 15 మధ్య జరుగుతాయి. అయితే ఈ ఏడాది డీలర్లు, రిటైలర్లు స్టాక్‌ను క్లియర్ చేయలేకపోయారు. ఈ పరిస్థితిలో చాలా కూలింగ్ కంపెనీలు తమ ప్రొడక్షన్ తగ్గించుకోవడం మినహా వేరే దారి లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది తమ ప్రొడక్షన్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. ఈ సంవత్సరం చాలా వేసవి ఉత్పత్తుల అమ్మకాలు బలహీనంగా ఉన్నాయని ఇమామీ వైస్ చైర్మన్ మోహన్ గోయెంకా చెబుతున్నారు. ఈ వేసవిలో AC- రిఫ్రిజిరేటర్ అమ్మకాలు 30-40% క్షీణించాయని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ VP కమల్ నందిని వెల్లడించారు. ఈ పరిస్థితులు కూలింగ్ కంపెనీలను ఆందోళనకు గురిచేశాయి. సీజనల్ బిజినెస్ దెబ్బతినడం ఎవరినైనా ఆందోళనలో పడేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?