Portable AC: చల్లటి కబురు.. చౌకైన పోర్టబుల్ కూలర్.. నిమిషాల్లో రూమంతా చల్లదనం..
రుతుపవనాలు వచ్చే సమయం ఆసన్నమైంది. కానీ ఎండాకాలం మాత్రం ఇంకా పూర్తికాలేదు. మరికొద్దిరోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు..
రుతుపవనాలు వచ్చే సమయం ఆసన్నమైంది. కానీ ఎండాకాలం మాత్రం ఇంకా పూర్తికాలేదు. మరికొద్దిరోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరూ ఓ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ను కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. దీన్ని ఒకసారి చెక్ చేయండి. మీకోసం ఓ ఐటెం షార్ట్‌లిస్టు చేశాం. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి.. ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 4,499 కాగా.. 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 2,999కి లభిస్తోంది. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. నెలకు రూ. 143 కడితే చాలు. ఈ కూలర్ కేవలం 680 గ్రాములు బరువు ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని వేలాడదీసుకునేందుకు వీలుగా స్ట్రాప్ కూడా ఉంది. ఈ పోర్టబుల్ ఏసీ వినియోగించేటప్పుడు 55 డెసిబుల్స్ శబ్దం వస్తుంది.
యూఎస్‌బీ కేబుల్ ద్వారా దీనికి కరెంట్ వినియోగించుకోవచ్చు. ఈ పోర్టబుల్ కూలర్ క్షణాల్లో మీ రూమంతా చల్లదనాన్ని ఇస్తుంది. దీనిలో అమర్చిన 500ml వాటర్ ట్యాంక్‌లో కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. కూలర్ ఫ్యాన్ గాలి వేగాన్ని 3 రకాలుగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ కూలర్ చల్లగాలితో పాటు పొగ మంచు కూడా వస్తుందని తెలిపారు. అల్ట్రాసోనిక్ అటోమిజేషన్ టెక్నాలజీ వల్ల ఇది పొగమంచును కూడా స్ప్రే చేస్తుందని అంటున్నారు.(Source)