AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas : మహిళలు ఈ ఒక్క కోర్సు నేర్చుకుంటే చాలు రోజుకు రూ.10 వేలు మీ సొంతం..

మహిళలు వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము.

Business Ideas : మహిళలు ఈ ఒక్క కోర్సు నేర్చుకుంటే చాలు రోజుకు రూ.10 వేలు మీ సొంతం..
business ideas
Madhavi
| Edited By: |

Updated on: Jun 06, 2023 | 8:30 AM

Share

మహిళలు వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ప్రతినెల వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అదేవిధంగా ఫంక్షన్లలో బ్లౌజులపై మగ్గం వర్క్ చేయించడం అనేది కామన్ గా మారింది. ఈ మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్లీ అని అంటూ ఉంటారు. నిజానికి ఈ మగ్గం వర్క్ ని ఉత్తర భారత దేశంలో జర్దోసి వర్క్ అని అంటారు. అంటే మగ్గంపై క్లాత్ ను వత్తి పట్టి దానిపై జర్దోసి తరహాలో రంగురంగు దారాలు ఉపయోగించి డిజైన్స్ చేస్తూ ఉంటారు. దీన్నే జర్దోసి వర్క్ లేదా మగ్గం వర్క్ అని అంటారు. పెళ్లి ఫంక్షన్లలో పట్టుచీరలపై ఉపయోగించే బ్లౌజులలో ఈ మగ్గం వర్క్ మనం గమనించవచ్చు.

అయితే ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా కూడా మీరు చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. నిజానికి మగ్గం వర్క్ లేదా జర్దోసి వర్క్ ఉత్తర భారత దేశానికి చెందిన కళాకారులకు బాగా వస్తుంది. మన మన రాష్ట్రంలో కూడా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన పనివారితో ఈ మగ్గం వర్క్ చేయిస్తూ ఉంటారు. కానీ స్థానికంగా కూడా మీరు శ్రద్ధగా నేర్చుకుంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీరు కూడా మగ్గం వర్క్ నేర్చుకోవాలని భావిస్తూ ఉంటే మాత్రం ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో ఈ మగ్గం వర్క్ ను నేర్పిస్తూ ఉన్నాయి. . అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ అతి తక్కువ ధరకే ఈ జర్దోసి డిజైనింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. కేవలం 1500 రూపాయలకే ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అంతే కాదు సర్టిఫికెట్ కూడా జారీచేస్తారు. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు సొంతంగా కూడా మగ్గం వర్క్స్ ప్రారంభించవచ్చు.

మీ వర్క్ ను పబ్లిసిటీ చేసుకునేందుకు సోషల్ మీడియాను ప్రభావం అంతగా వాడుకోవాలి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా మీ పనిని ప్రపంచానికి పరిచయం చేయాలి. అప్పుడు కస్టమర్లు మీ వద్దకు భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మగ్గం వర్క్ ద్వారా మీరు పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలి అనుకుంటే ఫ్యాషన్ డిజైనర్లతో ఒప్పందం చేసుకుంటే మంచిది అప్పుడు మీకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు మీ పనితీరును నలుగురికి తెలియజేయాలంటే, మోడల్స్ ద్వారా ఫ్యాషన్ షో లో పరిచయం చేస్తే మరిన్ని ఆర్డర్లను పెద్ద ఎత్తున మీరు పొందే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ గా మీరు జర్దోసి వర్క్ తో పాటు మరిన్ని డిజైనింగ్ కోర్సులను కూడా పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో ఫ్యాషన్ డిజైనర్ గా సైతం రాణించే వీలుంది.

మరిన్ని బిజినెస్ సంబంధిత వార్తల కోసం…

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌