Rupee vs Dollar: మరింత బక్కచిక్కిన రూపాయి.. రూ.80లకు దిగువన ట్రేడింగ్.. అసలేందుకు ఇలా..

|

Jul 19, 2022 | 11:49 AM

పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ దిగజారుతోంది. డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం తెగ టెన్షన్‌ పెడుతోంది.

Rupee vs Dollar: మరింత బక్కచిక్కిన రూపాయి.. రూ.80లకు దిగువన ట్రేడింగ్.. అసలేందుకు ఇలా..
Rupee Vs Dollar
Follow us on

డాలర్‌తో పోల్చితే.. రూపాయి మరింత బక్కచిక్కింది. మరో 11పైసలు క్షీణించిన రూపాయి 80 దగ్గర స్థిరపడింది. రూపాయి మారకం 80కి చేరువ కావడం ఆందోళనకు గురిచేస్తోంది.  ఈరోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ మొదటిసారి డాలర్‌కు 80 రూపాయల కనిష్ట స్థాయిని చూపించింది. ఇవాళ రూపాయి, డాలర్‌కు రూ. 80 దిగువకు వెళ్లి కరెన్సీ వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో ఈ ఏడాది రూపాయి 7 శాతం భారీ క్షీణతతో ట్రేడవుతోంది. ఆర్బీఐ ఎన్ని చర్యలు చేపడుతున్నా రూపాయి పతనానికి బ్రేకులు పడడం లేదు. ఇటీవల రెపో రేటును వరుసగా రెండుసార్లు పెంచినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రతికూలతలు రూపాయి మారకంపై తీవ్ర ప్రతికూలతను చూపుతున్నాయి.

రూపాయి ప్రారంభంలో ఎలా ఉంది..
మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌కు రూ. 80.01 కనిష్ట స్థాయిని తాకగా.. సోమవారం డాలర్‌తో రూ.79.97 వద్ద ముగిసింది. ఇవాళ డాలర్‌తో రూపాయి విలువ రూ.80.05 కనిష్ట స్థాయికి చేరుకుంది.

ఈరోజు..
ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ డాలర్‌కు రూ. 80.05 స్థాయికి పడిపోయింది. కానీ ఇప్పుడు అది 11 పైసలు పెరిగింది. ఈ ఉదయం 9.56 గంటలకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి రూ.79.94 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

రూపాయి ఎందుకు పతనం అవుతోంది..

గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవలి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారత కరెన్సీపై ఒత్తిడి తెచ్చి, దాని ప్రభావం కారణంగా భారత రూపాయి స్థిరమైన క్షీణతను చూస్తోంది. అదే సమయంలో యుఎస్‌లో ద్రవ్యోల్బణం రేటు 41 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఒక శాతం పెంచవచ్చడం కలిసి వస్తుందని అనుకున్నారు. దీని ప్రభావం వల్ల డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. రూపాయితో పోల్చితే పతనం కనిపిస్తోంది.

సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డాలర్‌తో రూపాయి చరిత్రలో పతనం జరిగిందని అంగీకరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు పెరుగుదల, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కఠినతరం వంటి కారణాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిందని అన్నారు.

బిజినెస్ న్యూస్ కోసం