Crude Oil: ఏప్రిల్‌లో భారీగా పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి.. మూడున్నరేళ్లలో ఇదే అత్యధికం..

భారత్‌ ఏప్రిల్ క్రూడాయిల్ దిగుమతులు 3.5 సంవత్సరాలలో అత్యధికంగా ఉన్నాయి. రష్యా తక్కువ ధరకు ముడి చమురు ఎగుమతి చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది...

Crude Oil: ఏప్రిల్‌లో భారీగా పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి.. మూడున్నరేళ్లలో ఇదే అత్యధికం..
Crude oil
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 21, 2022 | 5:00 PM

భారత్‌ ఏప్రిల్ క్రూడాయిల్(Crude Oil) దిగుమతులు(Inports) 3.5 సంవత్సరాలలో అత్యధికంగా ఉన్నాయి. భారత్‌ ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది. రష్యా(Russia) తగ్గింపు ధరలతో క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా చేయడంతో దిగుమతులు పెరిగినట్లు తెలుస్తుంది. మార్చి నుంచి ముడి చమురు దిగుమతులు సుమారు 9.7% పెరిగాయి. శుక్రవారం నాటి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా ప్రకారం, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 14.3% పెరిగి 20.87 మిలియన్ టన్నులకు చేరింది. ఇది అక్టోబర్ 2018 తర్వాత రఇదే అత్యధికం. పాశ్చాత్య ఆంక్షలు మాస్కోతో వాణిజ్యానికి దూరంగా ఉండడంతో రష్యా తక్కువ ధరకు చమురు ఎగుమతి చేస్తోంది.

దీంతో భారత్ కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచాయి. ఈ వారం ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఏప్రిల్‌లో భారతదేశానికి నాల్గో అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. చమురు ఉత్పత్తుల దిగుమతులు అంతకు ముందు సంవత్సరం కంటే 23.7% పెరిగి 3.79 మిలియన్ టన్నులకు చేరుకోగా, ఎగుమతులు 36.9% పెరిగాయి. ఏప్రిల్‌లో 5.36 మిలియన్‌ టన్నుల ఎగుమతుల్లో డీజిల్‌ 2.69 మిలియన్‌ టన్నులు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ చమురు శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి బలహీనపడడంతో చమురు కొనుగోలు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి అవసరం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..