AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Businessman: అదానీ జోరు.. అంబానీని దాటేసి మళ్ళీ నంబర్ 1 కుబేరుడిగా గౌతమ్ అదానీ!

Richest Businessman: గౌతమ్ అదానీ సంపదపై డాలర్ల వర్షం కురిసింది. ఆయన సంపద 3.56 బిలియన్ డాలర్లు పెరిగి 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు, ముఖేష్ అంబానీ మొత్తం సంపద అదానీ కంటే 90.8 బిలియన్ డాలర్లు అధికంగా పెరిగింది..

Richest Businessman: అదానీ జోరు.. అంబానీని దాటేసి మళ్ళీ నంబర్ 1 కుబేరుడిగా గౌతమ్ అదానీ!
Ambani - Adani
Subhash Goud
|

Updated on: Apr 17, 2026 | 8:33 PM

Share

Richest Businessman: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ నుండి ఆసియా, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు అనే బిరుదును కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గురువారం గౌతమ్ అదానీ సంపదపై డాలర్ల వర్షం కురిసింది. ఆయన సంపద 3.56 బిలియన్ డాలర్లు పెరిగి 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు, ముఖేష్ అంబానీ మొత్తం సంపద అదానీ కంటే 90.8 బిలియన్ డాలర్లు అధికంగా పెరిగింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ ఇప్పుడు 19వ స్థానానికి చేరుకోగా, అంబానీ 20వ స్థానానికి పడిపోయారు.

అయితే భారతీయ వ్యాపార రంగంలో దిగ్గజాలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య సంపద యుద్ధం ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మళ్ళీ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 400 కి.మీ రేంజ్‌.. వచ్చేసింది అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇవి కూడా చదవండి

మార్కెట్ పుంజుకోవడమే కారణం: అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా లాభపడటంతో గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ గణనీయంగా పెరిగింది. హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలు తిరిగి కోలుకోవడమే కాకుండా, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకున్నాయి.

సంపదలో మార్పులు: ముఖేష్ అంబానీ- గౌతమ్ అదానీల మధ్య నికర విలువ (Net Worth) లో తేడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తాజా మార్కెట్ ట్రెండ్స్ అదానీని అగ్రస్థానంలో నిలబెట్టాయి.

గ్లోబల్ ర్యాంకింగ్: ఈ మార్పుతో ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా అదానీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. అంబానీ కూడా టాప్ బిలియనీర్ల జాబితాలో కొనసాగుతున్నారు.

వ్యాపార విస్తరణ: అదానీ గ్రూప్ ఇటీవలి కాలంలో గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్ , సిమెంట్ రంగాల్లో చేస్తున్న భారీ విస్తరణలు కూడా ఈ వృద్ధికి ఊతమిచ్చాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల వీరి ఆస్తి విలువలలో తరచుగా మార్పులు జరుగుతుంటాయి. అయినప్పటికీ, అదానీ గ్రూప్ తిరిగి పుంజుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Indian Railways: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే ‘లోయర్ బెర్త్’ కన్ఫర్మ్.. ఇందులో నో డౌట్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us