AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revolt RV1 EV: తక్కువ ధరలో ఉత్తమ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్!

రివోల్ట్ తన కొత్త Revolt RV1 ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ విభాగంలో అగ్రగామిగా ఉన్న Revolt Motors కొత్త EV బైక్ మోడల్‌ను విడుదల చేసింది. రెండు ప్రధాన వేరియంట్‌లతో మార్కెట్ విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్‌ బైక్ ప్రారంభ స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,990. టాప్-ఎండ్ మోడల్..

Revolt RV1 EV: తక్కువ ధరలో ఉత్తమ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్!
Ev Bike
Subhash Goud
|

Updated on: Sep 19, 2024 | 8:02 PM

Share

రివోల్ట్ తన కొత్త Revolt RV1 ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ విభాగంలో అగ్రగామిగా ఉన్న Revolt Motors కొత్త EV బైక్ మోడల్‌ను విడుదల చేసింది. రెండు ప్రధాన వేరియంట్‌లతో మార్కెట్ విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్‌ బైక్ ప్రారంభ స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,990. టాప్-ఎండ్ మోడల్ రూ. 99,990 ధర నిర్ణయించింది కంపెనీ. ప్రస్తుతం భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మోటార్‌సైకిళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

విస్తరిస్తున్న మార్కెట్‌లో ప్రయాణీకుల వాహన విభాగం అత్యధిక వాటాను కలిగి ఉంది. ఏటా 80 లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లు అమ్ముడవుతున్నాయి. ఈ విధంగా కొత్త తరం అవసరాలను లక్ష్యంగా చేసుకుని, రివోల్ట్ మోటార్స్ ఆకర్షణీయమైన ధరలకు గొప్ప మైలేజీతో ఈవీ మోటార్‌సైకిల్ మోడల్‌లను పరిచయం చేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో ఇప్పటికే Revolt 400 సిరీస్ ఈవీ బైక్ మోడళ్లను విక్రయిస్తున్న రివోల్ట్ మోటార్స్.. ఇప్పుడు RV1 EV బైక్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ఈవీ బైక్ కొనుగోలుదారులకు ఇది గొప్ప ఎంపిక. ఇది పెట్రోల్ మోటార్‌సైకిళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసే విధంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: దేశంలో ఈ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి!

బ్యాటరీ ప్యాక్, మైలేజ్:

కొత్త Revolt RV1 ఎలక్ట్రిక్ బైక్ రెండు రకాల బ్యాటరీలను అందిస్తుంది. కొత్త బైక్ ప్రారంభ మోడల్ 2.2 KVH బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 100 కిమీ మైలేజీని అందిస్తుంది. అలాగే, టాప్-ఎండ్ మోడల్ 3.24 KVH బ్యాటరీ ప్యాక్‌తో అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై గరిష్టంగా 160 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2.2 KVH బ్యాటరీతో మోడల్ సున్నా నుండి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 2 గంటల 15 నిమిషాలు పడుతుండగా, అదే 3.24 KVH బ్యాటరీకి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..