Reliance: కోకో కోలాకు ధీటుగా రిలయన్స్ ప్రొడక్ట్స్.. ఎప్పటినుంచి అంటే..
అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న రిలయన్స్.. శీతలపానీయాల బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రిలయన్స్..
Business News: అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న రిలయన్స్.. శీతలపానీయాల బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రిలయన్స్ భారత మార్కెట్లోకి తన కూల్ డ్రింక్స్ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. గతంలో దేశంలో ఎంతో గుర్తింపు పొందిన క్యాంపా కోలా కూల్ డ్రింక్స్ బ్రాండ్ కంపెనీని రిలయన్స్ సంస్థ ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. అక్టోబర్ లో రిలయన్స్ సంస్థ శీతలపానీయాల ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపా కోలా ప్లేవర్లుగా గుర్తింపు పొందిన కోలా, నిమ్మ, ఆరెంజ్ ఫ్లేవర్‌లో కూల్ డ్రింక్స్ తయారీని ప్రారంభించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్‌ను లాంచ్ చేయడానికి రిలయన్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శీతలపానీయాల బ్రాండ్ లో తమదైన ముద్ర వేసుకున్న కోకో-కోలా పెక్సికోతో పోటీపడాలని రిలయన్స్ ఈవ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతుంది. రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, ఇతర కిరణా స్టోర్లలో ఈకూల్ డ్రింక్స్ ను అందుబాటులో ఉంచనుంది. ఫాస్ట్-మూవీంగ్ కన్య్జూమర్ గూడ్స్ మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా క్యాంపా కోలాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1990 సంవత్సరంలో శీతల పానీయాల రంగంలో క్యాంపా కోలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆతర్వాత కోకో-కోలా మూడు పార్లే బ్రాండ్ లను కొనుగోలు చేసిన తర్వాత వాటితో పోటీపడలేక మార్కెట్ నుంచి వైదొలగింది. అయితే 2019లో మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నం చేసినప్పటికి ఆర్థిక బలం లేకపోవడంతో వెనుకడుగు వేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ ఈ బ్రాండ్ ను ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి సొంతం చేసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..