JIO: కొన‌సాగుతోన్న జియో హ‌వా.. 3.16 కోట్ల యూజ‌ర్ల‌తో మొద‌టి స్థానం సుస్థిరం.. తెలుగు రాష్ట్రాల్లో..

JIO: టెలికాం ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌లనంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన జియో. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకొని టెలికాం రంగంలో స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. తాజాగా...

JIO: కొన‌సాగుతోన్న జియో హ‌వా.. 3.16 కోట్ల యూజ‌ర్ల‌తో మొద‌టి స్థానం సుస్థిరం.. తెలుగు రాష్ట్రాల్లో..
Reliance Jio
Follow us

|

Updated on: May 13, 2021 | 9:14 PM

JIO: టెలికాం ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌లనంగా దూసుకొచ్చింది రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన జియో. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకొని టెలికాం రంగంలో స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. తాజాగా ట్రాయ్ విడుద‌ల చేసిన టెలికాం యూజ‌ర్ల గణంకాల ప్ర‌కారం.. రిల‌య‌న్స్ జియో గ‌డిచిన ఫిబ్ర‌వ‌రి నెల‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 1.48 ల‌క్ష‌ల‌కుపైగా కొత్త‌చందాదారుల‌ను సంపాదించుకుంది. ఇక ఫిబ్ర‌వ‌రి నాటికి జియో యూజ‌ర్ల సంఖ్య ఏకంగా 3.16 కోట్ల‌కు చేరింది. దీంతో 40 శాతం మార్కెట్ వాటాతో జియో మొద‌టి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక మ‌రో ప్ర‌ముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌కు గ‌డిచిన ఫిబ్ర‌వ‌రి నెల‌లో కేవ‌లం 72,559 మొబైల్ యూజ‌ర్లు మాత్ర‌మే కొత్త‌గా చేరారు. ఇదిలా ఉంటే మ‌రో వైపు వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే జియో అత్య‌ధికంగా 42.66 ల‌క్ష‌ల మంది కొత్త యూజ‌ర్ల‌ను సంపాదించుకోగా.. ఎయిర్‌టెల్ 37.3 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను, వొడాఫోన్ ఐడియా 6.5 ల‌క్షల కొత్త యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంది. ఇక వొడాఫోన్, ఐడియా 6.5 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల‌ను కొత్త‌గా చేర్చుకుంది. ర‌క‌ర‌క‌లా ఆఫర్ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. బీఎస్ఎల్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయింది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఏకంగా 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇక డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ జియో అగ్ర‌స్థానంలో నిలిచింది. సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది.

Also Read: Sonu Sood : సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో

బెంగాల్ గవర్నర్ కు నల్లజెండాలతో స్వాగతం, కూచ్ బిహార్ జిల్లాలో స్థానికుల ఆగ్రహం, ఖంగు తిన్న జగ దీప్ ధన్ కర్

AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్ద‌రు మృతి

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..