Jio Recharge Plan: ఇకపై నెల మొత్తానికి ఒకేసారి రీఛార్జ్‌.. యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌..

Jio New Recharge Plan: ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో 28 రోజుల కాల పరిమితితో రీఛార్జ్ ఆఫర్లను ఉన్నాయి. మరికొన్ని సంస్థలు 23 రోజుల వ్యాలిడీటి కూడా ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది...

Jio Recharge Plan: ఇకపై నెల మొత్తానికి ఒకేసారి రీఛార్జ్‌.. యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌..
Jio Recharge

Updated on: Mar 28, 2022 | 5:36 PM

Jio New Recharge Plan: ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు 28 రోజుల కాల పరిమితితో రీఛార్జ్ ఆఫర్లను అందిస్తున్నాయి.  మరికొన్ని సంస్థలైతే కేవలం 23 రోజుల వ్యాలిడీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జ్‌ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా వినియోగదారుడు నష్టపోతున్నాడనే ఉద్దేశంతో టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్‌’ నెట్‌వర్క్‌ సంస్థలు కచ్చితంగా నెల రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జియో సంస్థ తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఈ కొత్త ప్లాన్‌తో ఇకపై యూజర్లు నెలకు ఒకేసారి రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రతి నెల ఏ తేదీనయితే రీఛార్జ్‌ చేసుకుంటారో మళ్లీ వచ్చే నెల ఆ తేదీ వరకు మళ్లీ రీచార్జ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో భాగంగానే జియో రూ. 259 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి నెల రోజుల పాటు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా వంటి ఇతర బెనిఫిట్స్‌ కూడా పొందొచ్చు. వినియోగదారుల కోసం జియో ఈ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యాప్‌ లేదా మరే ఇతర మార్గాల్లో అయినా రీఛార్జ్‌ చేసుకునే అవకాశం కలిపించింది.

Also Read: Viral Video: వాళ్ల రెక్కలను కత్తిరించవద్దు.. కత్తిరించాల్సి వస్తే మీ రెక్కలు కత్తిరించుకోండి.. మిస్ యూనివర్స్ – 2021 కామెంట్స్

KGF chapter 2 Trailer: మరోసారి అదరగొట్టిన రాకీ.. దుమ్మురేపుతున్న “KGF చాప్టర్ 2” ట్రైలర్..

Knowledge: పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు ఆకుపచ్చ పరదాలతో కప్పుతారు.. ఎందుకో తెలుసా..!