Nita Ambani: ‘విమెన్ కనెక్ట్ ఛాలెంజ్’ ఇండియా గ్రాంటీలను ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్
Nita Ambani: ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా ద్వారా భారతదేశవ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు (మంజూరుకర్తలు) గా ఎంపిక చేయబడ్డాయి. రిలయన్స్ ఫౌండేషన్,
Nita Ambani: ‘విమెన్ కనెక్ట్ ఛాలెంజ్’ ఇండియా ద్వారా భారతదేశ వ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు (మంజూరుకర్తలు) గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్ (USAID) కలసి విమెన్ కనెక్ట్ ఛాలెంజ్ ఇండియాను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.11 కోట్లను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించడానికి వినియోగిస్తారు.
ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్లను సమకూర్చుతుంది. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ డబ్బులను వాడుతారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం లభిస్తుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ..
‘‘ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియో ను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కలలు కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే అనుసంధానతను అందించగలగుతున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంత మైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినంద నలు, ఈ పరివర్తన ప్రయాణంలో కలసి పని చేసేందుకు వాటిని ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు.
విమెన్ కనెక్ట్ ఛాలెంజ్ ఇండియా 2020 ఆగస్టులో ప్రారంభించారు.180 కి పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి 10 సంస్థలు ఎంపిక చేశారు. వీటికి ఒక్కో దానికి 12 నుంచి 15 నెలల కాలానికి రూ.75 లక్షలు మొదలు రూ.కోటి దాకా గ్రాంటుగా లభించనుంది. 2021 జనవరిలో యూఎస్ ఎయిడ్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా సాల్వర్స్ సింపోజియంను నిర్వహించాయి. సెమీ-ఫైనలిస్టులను, సంబంధిత రంగాల నిపుణులను ఒకే వేదికపైకి చేర్చాయి. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు మేధోమథనం నిర్వహించాయి.
ఏడాదికేడాది మహిళల్లో మొబైల్ ఇంటర్నెట్ అవగాహన అధికమవుతోంది. 2017లో భారతదేశంలో కేవలం 19% మందికి మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ గురించి తెలుసు. 2020లో ఇది 53 శాతానికి పెరిగింది. యాజమాన్యపరంగా చూస్తే, 79% పురుషులకు గాను 67% మంది మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్ ను కలిగిఉన్నారు. ఇన్నేళ్లుగా రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు డిజిటల్ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో కొనసాగాయి. రిలయన్స్ జియో ద్వారా 1.3 బిలియన్లకు పైగా భారతీయులు దేశవ్యాప్త డిజిటల్ విప్లవంలో భాగస్వాములయ్యారు. తమ జీవితాలను మార్చుకున్నారు.
అమ్మాయిలు ఈ 5 అలవాట్లు ఉన్న అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు..! ఎందుకంటే..?