Hyderabad Property Rates: హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ జోరు.. అమ్మకాలు.. కొనుగోళ్లల్లో నయా రికార్డ్‌ ఇదే..!

ఓ తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్ సెప్టెంబర్ 2023లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీలను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అంటే నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ. 3,378 కోట్లుగా ఉంది. ఇది కూడా దాదాపు 42 శాతం పెరిగింది. ఈ నివేదిక ప్రజలు ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తుంది.

Hyderabad Property Rates: హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ జోరు.. అమ్మకాలు.. కొనుగోళ్లల్లో నయా రికార్డ్‌ ఇదే..!
Real Estate
Follow us
Srinu

|

Updated on: Oct 20, 2023 | 6:00 PM

భారతదేశంలో ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. ఈ మెట్రో నగరంలో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాల వల్ల లక్షలాది మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఓ తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్ సెప్టెంబర్ 2023లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీల కొనుగోలును నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అంటే నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ. 3,378 కోట్లుగా ఉంది. ఇది కూడా దాదాపు 42 శాతం పెరిగింది. ఈ నివేదిక ప్రజలు ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్‌ ఏయే ప్రాంతాల్లో నివసించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

హైదరాబాద్ ప్రాపర్టీ రేట్లు ఇలా

సెప్టెంబర్ 2023లో హైదరాబాద్‌లో అత్యధికంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌లు రూ. 25 – 50 లక్షల ధర పరిధిలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా ఆస్తుల రిజిస్ట్రేషన్లను మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 51 శాతం వాటా ఉంది. రూ. 25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్‌లో 15 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ పరిమాణాలు కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా సెప్టెంబర్ 2023లో 9 శాతంగా ఉంది. అయితే ఇదే విలువ సెప్టెంబర్ 2022లో 8 శాతంగా ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబరు 2023లో నమోదైన ఆస్తులు 1,000-2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిమాణ వర్గం 71 శాతం రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉంది. చిన్న గృహాలకు (500 -1,000 చదరపు అడుగులు) డిమాండ్‌లో ఒక మోడరేషన్ ఉంది. సెప్టెంబర్ 2022లో 16 శాతం ఉన్న ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబరు 2023లో 14 శాతానికి పడిపోయాయి. అయినప్పటికీ 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ఆస్తులు డిమాండ్ పెరిగాయి, సెప్టెంబర్ 2022లో 9 శాతం నుంచి 2023 సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్‌లు 11 శాతానికి పెరిగాయి. 

ఏరియాల వారీగా హైదరాబాద్ ప్రాపర్టీ రేట్లు 

జిల్లా స్థాయిలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి నిలకడగా 45 శాతం గృహ విక్రయాల రిజిస్ట్రేషన్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా 41 శాతం విక్రయాల రిజిస్ట్రేషన్‌తో దగ్గరగా ఉంది. అయితే సెప్టెంబర్ 2023లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా 14 శాతం వాటాను కలిగి ఉంది. ఆగస్టు 2023లో లావాదేవీలు జరిపిన నివాస ప్రాపర్టీల సగటు ధరలు 6.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. జిల్లాల్లో, హైదరాబాద్‌లో 14 శాతం ధర పెరిగింది. తర్వాత మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి వరుసగా 5 శాతం, 3 శాతం వద్ద ఉన్నాయి. సెప్టెంబర్ 2023లో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ అమ్మకాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే ధరల శ్రేణి రూ. 25 – 50 లక్షలుగా ఉంది. 

ఇవి కూడా చదవండి

బల్క్ లావాదేవీల కేంద్రీకరణకు మించి గృహ కొనుగోలుదారులు ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారని అర్థం అవుతుంది. ఇవి పరిమాణంలో పెద్దవి, మెరుగైన సౌకర్యాలను అందిస్తాయి. ఈ తరహా డీల్స్‌ హైదరాబాద్, రంగారెడ్డి వంటి మార్కెట్‌లలో జరిగాయి. వీటిలో ఆస్తులు 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. వాటి విలువ రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే డిమాండ్ విశ్లేషణ సందర్భంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో లాంచ్ ట్రెండ్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. మార్కెట్‌లోని గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి కార్యకలాపాలు కూడా 2 బీహెచ్‌కే యూనిట్‌లకు అనుగుణంగానే 3 బీహెచ్‌కేల కొనుగోలుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే హైదరాబాద్‌లోని డెవలపర్‌లు ముఖ్యంగా 3 బీహెచ్‌కే యూనిట్‌ల ప్రవేశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా 2 బీహెచ్‌కేల నిర్మాణాలను అదుపులో ఉంచుతూ 3 బీహెచ్‌కేలను నిర్మించడంతో వాటిని చాలా ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఈ వ్యూహాత్మక దృష్టి గృహ కొనుగోలుదారుల మారుతున్న ప్రాధాన్యతలను తెలియజేస్తుందని మార్కెట్‌ రంగ నిపుణులు వివరిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే