AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Estate: కరోనా రెండో వేవ్ ప్రభావం.. మళ్ళీ మందగమనం లో రియల్ ఎస్టేట్ రంగం

Real Estate: 2020 లో కోవిడ్ -19 మహమ్మారి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని మందగమనంలో చెత్త దశలోకి నెట్టేసింది. కానీ ఆశ్చర్యంగా, లాక్ డౌన్ పరిస్థితులు సర్దుమణిగాకా వేగంగా పునరుజ్జీవనం పొందింది.

Real Estate: కరోనా రెండో వేవ్ ప్రభావం.. మళ్ళీ మందగమనం లో రియల్ ఎస్టేట్ రంగం
Real Estate
KVD Varma
|

Updated on: May 10, 2021 | 10:49 PM

Share

Real Estate: 2020 లో కోవిడ్ -19 మహమ్మారి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని మందగమనంలో చెత్త దశలోకి నెట్టేసింది. కానీ ఆశ్చర్యంగా, లాక్ డౌన్ పరిస్థితులు సర్దుమణిగాకా వేగంగా పునరుజ్జీవనం పొందింది. మొన్న రెండో వేవ్ విరుచుకుపడటం ప్రారంభం అయ్యే వరకూ భరత ఇర్యాల్ ఎస్టేట్ రంగం పచ్చగా మెరిసింది. అయితే, కరోనా మళ్ళీ రియల్ ఎస్టేట్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ స్తబ్దుగా మారిపోయింది. ఈ పరిస్థితుల గురించి టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ట్రిల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజయ్ దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా రెండో వేవ్ ప్రభావాన్ని ఆయన వివరించారు.

ఆయన చెప్పినదాని ప్రకారం 15 నగరాల్లో 20 (17 రెసిడెన్షియల్, 3 కమర్షియల్ ఆఫీస్) ట్రిల్ ప్రాజెక్టులు 3 వేల మంది కార్మికులతో కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ట్రిల్ ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించింది. అయితే, సైట్ చూసే అవకాశం వినియోగదారులకు లేకపోవడంతో ఈ అమ్మకాలు ఆగిపోయాయి.

ఆయన లెక్క ప్రకారం రియల్ ఇండస్ట్రీ జూన్ తో ముగిసే త్రైమాసికం ఫలితాలు పూర్తిగా మందగమనంలో ఉంటాయి. ఎంతగా అంటే, జూన్ 2020 త్రైమాసిక ఫలితాల కంటె తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అయితే, ట్రిల్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక లీజింగ్ కార్యకలాపాలు చాలా నెమ్మదిగా ఉంటాయని ఆయన అంటున్నారు. ఎందుకంటే, కొన్ని కంపెనీలు లాక్దౌన్ తరువాత ఒక సంవత్సరం గడిచినా తిరిగి తెరిచేందుకు ఇష్టపడక పోవచ్చు.

ఈ పరిస్థితిని ట్రిల్ ఎలా అధిగమించడానికి ప్రయత్నిస్తుందనే అంశంపై ఆయన వివరించారు సంజయ్ దత్. ”రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మా ఆదాయం 2020-21లో రూ .200 కోట్లకు పైగా పెరిగింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరిగింది. మేము గత సంవత్సరం అత్యధికంగా అమ్మకాలు సాధించాము మరియు జనవరి-మార్చి మా ఉత్తమ పనితీరు కలిగిన త్రైమాసికం. పదమూడు ప్రాజెక్టులు వాటి అమ్మకాల లక్ష్యాలలో 100% మించిపోయాయి.” అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ గాడిన పడటానికి ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేని పరిస్థితి. లాక్ డౌన్ లేకపోయినా ప్రజల సంచారంపై కర్ఫ్యూ నిబంధనలు. కరోనా కారణంగా బహిరంగంగా అమ్మకాలు సాగించడానికి చేసే ప్రమోషన్ వర్క్ చేసే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో రియల్ రంగం డీలా పడిపోయే పరిస్థితి ఉందని ఈ రంగానికి చెందిన విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిర్మాణ రంగం కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోంది. లాక్ డౌన్ సమయంలో కార్మికులు వెళ్ళిపోయి.. మళ్ళీ మామూలు పరిస్తితులల్లో తిరిగి వెనక్కి రావడంతో అప్పట్లో ఆగిపోయిన ప్రాజెక్టులు గట్టున పడటం ప్రారంభం అయింది. ఇంతలోనే.. మళ్ళీ గత సంవత్సరపు పరిస్థితులు తిరిగి వచ్చాయని చెబుతున్నారు.

ఇప్పుడు వినియోగదారుల ట్రెండ్ కూడా మారింది. గతంలో కాంపాక్ట్ ఇళ్ళ కోసం చూసేవారు. కానీ, ఇప్పుడు పెద్ద ఇళ్ళను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కరోనా తెచ్చిన పెద్ద మార్పు. ఇప్పుడు కాంపాక్ట్ ఇళ్ళ కంటె పెద్ద ఇళ్ళు.. అదీ ఇండిపెండెంట్ తరహా ఇళ్ళకు డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా రియల్ రంగం మారాల్సి వస్తున్న సమయంలో ఇప్పుడు ఈ రెండో వేవ్ కారణంగా కొంత ఇబ్బంది వచ్చింది. ఈ వేవ్ తగ్గిన తరువాత పరిస్థితులపై అంచనా వేయడం ఇప్పుడప్పుడే చాలా కష్టం అని ఈ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్నవారు చెబుతున్నారు.

Also Read: కొత్తకారు వాసన ఆరోగ్యానికి మంచిది కాదు..! ఇది చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..

Onion Price: కొత్త పంట వస్తున్నా.. రిటైల్ మార్కెట్లో దిగిరాని ఉల్లి ధర..! ఎందుకో తెలుసా..!