ఆర్బీఐ కొత్త రూల్.. ఇకపై ఏటీఎంలలో పెద్ద నోట్లు ఉండవా?

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందజేసింది. ఇకపై ఏటీఎమ్‌ల నుంచి నగదు విత్ డ్రా చేసేటప్పుడు రూ.2000 నోట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. క్రమేపి వాటి సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించింది. అంతేకాక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.2000లను తొలిగించారని సమాచారం. ప్రస్తుతం పెద్ద నోట్ల సంఖ్యను ఏటీఎంలలో క్రమేపి తగ్గించి చిన్న నోట్లను వాటిల్లో […]

ఆర్బీఐ కొత్త రూల్.. ఇకపై ఏటీఎంలలో పెద్ద నోట్లు ఉండవా?
Ravi Kiran

|

Oct 06, 2019 | 4:59 PM

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందజేసింది. ఇకపై ఏటీఎమ్‌ల నుంచి నగదు విత్ డ్రా చేసేటప్పుడు రూ.2000 నోట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. క్రమేపి వాటి సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించింది. అంతేకాక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా చోట్ల ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.2000లను తొలిగించారని సమాచారం. ప్రస్తుతం పెద్ద నోట్ల సంఖ్యను ఏటీఎంలలో క్రమేపి తగ్గించి చిన్న నోట్లను వాటిల్లో ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నారట. పెద్ద నోట్లకు అనువైన క్యాసెట్ బాక్స్‌లను ఇప్పటికే తొలగించామని.. దీని ద్వారా రూ.100, రూ.200ల నోట్ల సంఖ్యను మరింతగా పెంచే అవకాశం ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎస్‌బీఐ ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్స్‌ను కూడా పెంచారు. మెట్రో సిటీస్‌లో ఇకపై ఉచిత విత్ డ్రా పరిమితిని 10 నుంచి 12కు మార్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu