నెలకు రూ.50 వేలు కావాలా? మరి ఈ వ్యాపారానికే ఫుల్ డిమాండ్!

ప్లాస్టిక్‌పై నిషేదానికి నడుం బిగించిన మోదీ ప్రభుత్వం.. ఇందుకు ప్రత్యామ్న్యాయంగా మరోకొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేదించారు. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు తదితరాలను ఇకపై వాడకూడదని.. ఉత్పత్తులు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. దీంతో ప్లాస్టిక్‌ ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారాలన్నింటికీ పెద్ద దెబ్బే వాటిల్లినప్పటికీ.. అదే సమయంలో అతి తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించే కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ తరుణంలో నెలకు రూ.50,000 సంపాదన తెచ్చిపెట్టే […]

నెలకు రూ.50 వేలు కావాలా? మరి ఈ వ్యాపారానికే ఫుల్ డిమాండ్!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 06, 2019 | 3:08 PM

ప్లాస్టిక్‌పై నిషేదానికి నడుం బిగించిన మోదీ ప్రభుత్వం.. ఇందుకు ప్రత్యామ్న్యాయంగా మరోకొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేదించారు. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు తదితరాలను ఇకపై వాడకూడదని.. ఉత్పత్తులు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. దీంతో ప్లాస్టిక్‌ ఉత్పత్తికి సంబంధించిన వ్యాపారాలన్నింటికీ పెద్ద దెబ్బే వాటిల్లినప్పటికీ.. అదే సమయంలో అతి తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించే కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ తరుణంలో నెలకు రూ.50,000 సంపాదన తెచ్చిపెట్టే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ బ్యాన్‌తో జ్యుట్ బ్యాగుల డిమాండ్ ఇప్పుడు భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన యూనిట్‌ను ఆరంభిస్తే.. లాభాలు అద్భుతంగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఈ జ్యుట్ బ్యాగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు 5 కుట్టు మిషిన్లు అవసరమవుతాయని హ్యాండ్‌క్రాఫ్ట్స్ డివిజన్ అధికారులు చెబుతున్నారు. వీటికి దాదాపు రూ.లక్ష ఖర్చువుతుందట. అంతేకాక వర్కింగ్ క్యాపిటల్‌కు రూ.లక్షా 4వేలు.. నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులకు మరో 58 వేలు అవసరం అవుతాయని తెలుస్తోంది. ఇక మొత్తంగా జ్యుట్ బ్యాగ్ తయారీ యూనిట్‌కు దాదాపు రూ.2.52 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో 65శాతం ముద్ర పథకం కింద రుణం, మరో 25 శాతం NCFD (నేషనల్ సెంటర్ ఫర్ జ్యుట్  డైవర్సిఫికేషన్) కింద అందుతుంది. అందువల్ల అతి తక్కువ పెట్టుబడి.. గణనీయమైన ఆదాయానికి తోడ్పడే ఈ జ్యుట్ బ్యాగుల తయారీకి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.