RBI Rules: ఆన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు.. క్లెయిమ్ చేయడం ఎలా?
ఒకవేళ ఖాతాదారులు చనిపోయిన తర్వాత వారి ఖాతా డబ్బును ఎవరూ క్లెయిమ్ చేయరు. అలాగే ఖాతాలు నిష్క్రియమవుతాయి. అటువంటి నిష్క్రియ ఖాతా నుండి క్లెయిమ్ చేయని డబ్బు ఆర్బీఐ డీఈఏ ఫండ్ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్)కి బదిలీ చేయబడుతుంది. ఇప్పుడు ఇలా క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.40,000 కోట్లకు పైగా ఉందని ఇది వరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది..
10 సంవత్సరాలకు పైగా బ్యాంకు ఖాతాలో లావాదేవీలు జరగకపోతే, అది పనికిరాని బ్యాంకు ఖాతాగా గుర్తిస్తుంది బ్యాంకు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఖాతాదారులు చనిపోయిన తర్వాత వారి ఖాతా డబ్బును ఎవరూ క్లెయిమ్ చేయరు. అలాగే ఖాతాలు నిష్క్రియమవుతాయి. అటువంటి నిష్క్రియ ఖాతా నుండి క్లెయిమ్ చేయని డబ్బు ఆర్బీఐ డీఈఏ ఫండ్ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్)కి బదిలీ చేయబడుతుంది. ఇప్పుడు ఇలా క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.40,000 కోట్లకు పైగా ఉందని ఇది వరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీన్ని లబ్ధిదారులకు అందించేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది.
ఆర్బీఐ మార్గదర్శకాలు:
- డోర్మాంట్ బ్యాంక్ అకౌంట్లు, అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
- ఏడాదికి పైగా లావాదేవీలు జరగని ఖాతాలు ఉన్నాయా లేదా అనేది బ్యాంకులు ప్రతి సంవత్సరం తనిఖీ చేయాలి.
- రెన్యువల్ కాని టర్మ్ డిపాజిట్లను కూడా తనిఖీ చేయాలి.
- రెండు పీరియడ్‌ల కంటే తక్కువ వ్యవధిలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ఇన్‌ఆపరేటివ్ ఖాతాగా గుర్తించకూడదు.
బ్యాంకు ఖాతా పనిచేయకపోతే, అందులో డబ్బు జమ చేసేందుకు వీలుండదు. దీంతో ప్రభుత్వ డీబీటీ బదిలీ, స్కాలర్‌షిప్ నగదు బదిలీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఈ ఖాతాలు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయి. మీకు ఏదైనా నిష్క్రియ పాత ఖాతా ఉంటే, ముందుగా దాని నుండి లావాదేవీలు చేయడానికి ప్రయత్నించండి. బ్యాంకుకు వెళ్లి ఖాతాను తనిఖీ చేయండి. లేదా మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళితే, అక్కడ పనిచేయని ఖాతాల జాబితాను చూడవచ్చు. మీ ఖాతా ఉందో లేదో తనిఖీ చేయండి.
ఖాతాదారుడు మరణించినట్లయితే, వారసులు వారి మరణ ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, గుర్తింపు రుజువు పత్రాలను అందించడం ద్వారా డబ్బును పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి