AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.2 వేల నోట్లు ఇంకా మీ దగ్గర ఉన్నాయా..? ఆర్బీఐ నుంచి బిగ్ డెసిషన్ వచ్చేసింది.. ఏం చేయాలంటే..

ఆర్బీఐ రూ.2 వేల నోటుపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ ప్రజల వద్ద ఉంటే మార్చుకోవాలని సూచించింది. బ్యాంకుల ద్వారా మార్చుకునేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో.. ఎలా మార్చుకోవాలనేది వివరించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ వివరాలు చూద్దాం.

RBI: రూ.2 వేల నోట్లు ఇంకా మీ దగ్గర ఉన్నాయా..? ఆర్బీఐ నుంచి బిగ్ డెసిషన్ వచ్చేసింది.. ఏం చేయాలంటే..
Rbi
Venkatrao Lella
|

Updated on: Jul 10, 2026 | 4:36 PM

Share

రూ.2 వేల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్దంగా చలమణిలో ఉన్నాయని స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు వెనక్కి తీసుకునే ప్రక్రియను ఆర్బీఐ 2023మే 19 నుంచి చేపట్టింది. అయితే ఇప్పటికీ కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉండగా.. అలాంటివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నోటు ఇప్పటికీ పూర్తిగా చట్టబద్ధమైన చలామణిలో ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికీ మీ దగ్గర నోటు ఉంటే ఆర్బీఐ కార్యాలయాలు లేదా మీ బ్యాంకు అకౌంట్లో జమ చేసుకోవచ్చని ప్రకటన జారీ చేసింది. ఇప్పటికీ చాలా నోట్లు తిరిగి వచ్చాయని, కానీ స్వల్ప మొత్తంలో ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది.

ఇంకా మీ దగ్గర ఉన్నాయా..?

2023 మేలో ఆర్బీఐ ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసిన సమయంలో మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. ఏప్రిల్ 2026 వరకు మార్కెట్లో కేవలం రూ. 5451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం నోట్లలో 98.47 శాతం వరకు ఇప్పటికే తిరిగి వచ్చాయి. మీ దగ్గర ఇంకా ఉంటే మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా క్లారిటీ ఇచ్చింది. సాధారణ బ్యాంకు శాఖలలో ఈ నోట్లను మార్చుకునేందుకు అక్టోబర్ 7, 2023 వరకు ఆర్బీఐ గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసినందున రెండు విధవానాల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించి మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన19 కార్యాలయాలలో ఎక్కడైనా మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు

పోస్టాఫీస్ ద్వారా మార్చుకోండిలా..

ఇక పోస్టాఫీసు ద్వారా కూడా రూ.2 వేల నోట్లను మార్చుకోవ్చు. దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా రూ.2 వేల నోట్లను నేరుగా ఆర్బీఐ జారీ కార్యాలయానికి పంపవచ్చు. నోట్లు చేరిన తర్వాత ఆ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ జారీ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను వెనక్కి రాబట్టేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ అవకాశం కల్పిస్తోంది. లీగల్ టెండర్‌గా రూ.2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Follow Us