AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్కార్‌ బడిలో చేరితే బంపర్ గిఫ్ట్స్.. సైకిల్, బియ్యం, బుక్స్, కుక్కర్ అన్నీ Free.. Free! ఆకర్షిస్తున్న ఆఫర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఆ ఊరి గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల రేషన్ బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు నోట్‌బుక్స్‌, స్కూల్ బ్యాగులు, ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా అందజేయనున్నారు. అదేవిధంగా 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు..

సర్కార్‌ బడిలో చేరితే బంపర్ గిఫ్ట్స్.. సైకిల్, బియ్యం, బుక్స్, కుక్కర్ అన్నీ Free.. Free! ఆకర్షిస్తున్న ఆఫర్లు
Nagulapahad Govt School Students Incentives
Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 4:27 PM

Share

నల్గొండ, జులై 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సర్కార్‌ బడుల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాగులపహాడ్ గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపింది. గ్రామపంచాయతీ ప్రకటించిన వివరాల ప్రకారం..

ప్రభుత్వ స్కూల్‌లో పిల్లలను చేర్చించిన ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల రేషన్ బియ్యం అందించనున్నారు. అలాగే రైస్ కుక్కర్, విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, ఇతర విద్యా సామగ్రి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సైకిళ్లు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో విద్యా ప్రాధాన్యతను పెంచడం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం, పాఠశాల మానివేతలను తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.

ఇందుక సంబంధించి ప్రచార పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మన బడి.. మన పిల్లల బంగారు భవిష్యత్తు పేరిట విడుదల చేసిన పోస్టర్‌లో అడ్మిషన్లు లేకపోతే స్కూల్ మూసే అవకాశం ఉంది. దయచేసి విద్యార్థులను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించండి అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్య హక్కును ప్రతి చిన్నారికి చేరువ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

Follow Us