Indian Railway: మీరు రైలు ఎక్కబోతున్నారా? ముందు ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!
Indian Railway Luggage Rules: మీరు బుకింగ్ చేసుకోకుండా ఉచిత పరిమితి కంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తూ పట్టుబడితే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. రైల్వేల ప్రస్తుత నిబంధనల ప్రకారం , పట్టుబడితే అదనపు లగేజీ బుకింగ్ ఛార్జీకి 6 రెట్లు వరకు జరిమానా విధించవచ్చు..

Indian Railway Luggage Rules: సాధారణంగా రైలు ప్రయాణాన్ని అందరు ఇష్టపడుతుంటారు. కానీ రైళ్లలో వెళ్లేవారు లగేజీ భారీగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఎంచుకుంటారు కాబట్టి ఎక్కువ సేపు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో లగేజీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే మీ లగేజీకి పరిమితి విధించనుంది. నిబంధనల ప్రకారం మీ లగేజీ ఎక్కువగా ఉంటే అందుకు ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ లగేజీ ఉండటం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా మారనుంది. దీంతో కొత్త రూల్స్‌ను తీసుకువస్తోంది రైల్వే. ఇప్పుడు మీరు ఈ అలవాటును మార్చుకోవాలి. విమానాల మాదిరిగానే భారతీయ రైల్వేలలో లగేజీకి సంబంధించి కొత్త నియమం వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏ లగేజీని తీసుకెళ్తున్నా, దానిని స్టేషన్‌లో తూకం వేస్తారు. అప్పుడే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు.
ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్
రైల్వేలు ఇప్పుడు దేశంలోని అనేక ప్రధాన స్టేషన్లలో విమానాశ్రయాల మాదిరిగా లగేజ్ స్కానర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. ఈ వ్యవస్థను మొదట నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీని కింద దాదాపు రూ. 960 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ వ్యవస్థ ఇలా పనిచేస్తుంది
స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మీ లగేజీని తూకం వేస్తారు. మీ లగేజీ నిర్ణీత పరిమితిలోపు ఉంటేనే మీరు ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. బరువు మాత్రమే కాకుండా లగేజీ పరిమాణం కూడా తనిఖీ చేస్తారు అధికారులు. లగేజీ బరువు తక్కువగా ఉండి, పరిమాణం పెద్దగా ఉంటే దానిపై అదనపు ఛార్జీ విధిస్తారు. ఈ పరిమితికి మించి బరువు ఉన్నా, లేక మీ బ్యాగు పెద్ద సైజులో ఉన్నా మీరు ఛార్జీలు చెల్లించుకోక తప్పదు.
ఇది కూడా చదవండి: Rapido: రాపిడోకు భారీ షాక్.. రూ.10 లక్షల జరిమానా.. కస్టమర్ల ఫిర్యాదుతో సీసీపీఏ చర్యలు!
ఏ తరగతిలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు?
రైల్వేలలో ప్రతి తరగతికి ఉచిత లగేజీ పరిమితిని గతంలో నిర్ణయించారు. అయితే, ఇప్పటివరకు దీనిని కఠినంగా అమలు చేయలేదు. ఇప్పుడు మీరు ఈ పరిమితులను గుర్తుంచుకోవాలి.
- AC ఫస్ట్ క్లాస్: 70 కిలోలు
- సెకండ్ ఏసీ: 50 కిలోలు
- థర్డ్ ఏసీ/చైర్ కార్: 40 కిలోలు
- స్లీపర్ క్లాస్: 40 కిలోలు
- జనరల్: 35 కిలోలు
పరిమితికి మించి లగేజీ ఉంటే ఏమి చేయాలి?
మీ లగేజీ నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. రైల్వేలు మీకు అదనపు లగేజీని బుక్ చేసుకోవడానికి, తీసుకెళ్లడానికి సౌకర్యాన్ని అందిస్తాయి. మీరు స్టేషన్‌లో ఉన్న పార్శిల్ కార్యాలయానికి వెళ్లి మీ అదనపు లగేజీని బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. మీరు స్లీపర్ క్లాస్‌లో 500 కి.మీ ప్రయాణిస్తున్నారని అనుకుందాం. అలాగే మీ దగ్గర 80 కిలోల లగేజీ ఉంది. స్లీపర్ క్లాస్ ఉచిత పరిమితి 40 కిలోలు. మీ అదనపు లగేజీ 40 కిలోలు, ఈ 40 కిలోల కోసం మీరు పార్శిల్ ఆఫీసులో బుక్ చేసుకోవాలి. దీనికి రుసుము దాదాపు రూ. 110 ఉంటుంది.

ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా:
మీరు బుకింగ్ చేసుకోకుండా ఉచిత పరిమితి కంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తూ పట్టుబడితే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. రైల్వేల ప్రస్తుత నిబంధనల ప్రకారం , పట్టుబడితే అదనపు లగేజీ బుకింగ్ ఛార్జీకి 6 రెట్లు వరకు జరిమానా విధించవచ్చు.
ఇది కూడా చదవండి: TGSRTC కార్గో నుంచి తీసుకెళ్లని వస్తువుల వేలం.. 90 శాతం డిస్కౌంట్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








