AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM sym: నెలకు రూ. 200 చెల్లిస్తే, ప్రతీ నెల రూ. 6 వేల పెన్షన్‌.. దంపతుల కోసం సూపర్ పథకం..

పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి పలు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే...

PM sym: నెలకు రూ. 200 చెల్లిస్తే, ప్రతీ నెల రూ. 6 వేల పెన్షన్‌.. దంపతుల కోసం సూపర్ పథకం..
Representative Image
Narender Vaitla
|

Updated on: Nov 24, 2022 | 4:08 PM

Share

పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి పలు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌-ధన్‌ (PM-SYM) పేరుతో ఈ పథకాన్ని గతంలోనే కేంద్రం రూపొంచింది. ఈ పథకంలో భాగంగా దంపతులు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. నెలకు చెరో రూ. వంద రూపాయలు (మొత్తం రూ. 200) చెల్లిస్తే తర్వాత ఏటా రూ. 72,000 పెన్షన్‌ పొందొచ్చు.

ఎవరు అర్హులు..

కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు వంటి వారు ఈ పథకం పొందడానికి అర్హులు. అలాగే నెలవారీ ఆదాయం రూ. 15,000 అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల ఇతర వృత్తుల వారు కూడా అర్హులే. ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 ఏళ్లు ఉందనుకుందాం. దంపతులు ఇద్దరు నెలకు రూ. 200 చెల్లిస్తే ఏడాదికి రూ. 1200 అవుతుంది. వీరిలో 60 ఏళ్లు నిండిన వ్యక్తికి ఏటా రూ. 36,000 పెన్షన్‌ పొందొచ్చు.

ఒకవేళ పింఛన్‌ పొందే సమయంలో చందదారుడు మరణిస్తే లబ్ధిదారుని భాగస్వామికి అతను పొందే పెన్షన్‌లో 50 శాతం అందిస్తారు. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది. ఆసక్తి ఉన్న వారు మీకు దగ్గరల్లోనీ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ స్కీమ్ (CSC)ను సందర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..