AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలో తెలుసా..

పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని రికవరీ చేయమని బ్యాంకులు ఒత్తిడి చేయవు. ఎందుకంటే..

Bank Loan: బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలో తెలుసా..
ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి రెపో రేటు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అలా జరిగితే.. ఈఎంఐ, వడ్డీరేట్లు పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.
Sanjay Kasula
|

Updated on: Nov 23, 2022 | 3:23 PM

Share

ప్రజలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనేక రకాల రుణాలను తీసుకుంటారు. ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి బ్యాంకులు హోమ్ లోన్, కారు కొనడానికి ఆటో లోన్, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్ ఇస్తాయి. ఈ రుణాలపై బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. రుణగ్రహీత EMIల రూపంలో రుణాన్ని చెల్లిస్తారు. రుణం తీసుకోవడానికి మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి రుణం తీసుకుని ఇంకా పూర్తిగా రుణం చెల్లించక ముందే.. అంటే ఈ లోగా తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకుకు బకాయి ఉన్న రుణ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఇంకా తెలియకుంటే, ఇక్కడ మీకు దాని గురించి సవివరమైన సమాచారం అందించబడుతున్నాం..

వ్యక్తిగత రుణం 

ఈ రుణం ఇప్పటికే అసురక్షిత రుణం కేటగిరీలో ఉంచబడింది. దీని కింద బ్యాంకులు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అటువంటి రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత రుణం తీసుకున్న వ్యక్తిపై మాత్రమే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు లేదా సంస్థ ఆ వ్యక్తి కుటుంబాన్ని రుణాన్ని రికవరీ చేయమని ఒత్తిడి చేయవు.

గృహ రుణం

గృహ రుణం తీసుకోవడానికి ఏ వ్యక్తి అయినా ఇంటి కాగితాలను లేదా ఆ రుణానికి సమానమైన ఆస్తి కాగితాలను తనఖా పెట్టాలి. అయితే రుణం తీసుకున్న వ్యక్తి కొంతకాలనికి మరణిస్తే మిగిలిన రుణాన్ని అతని వారసుడు తిరిగి చెల్లించాలి. అతను రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోతే.. బ్యాంకులు వారి రుణాన్ని తిరిగి పొందేందుకు ఆస్తిని వేలం వేస్తాయి.  ఇలాంటి సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి బీమా చేయాలని బ్యాంక్ అధికారులు సూచిస్తారు. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తికి ఏదైన జరిగితే బీమా వర్తిస్తుంది. అయితే, గృహ రుణంపై బీమా చేస్తే బీమా కంపెనీ ఆ మొత్తం రుణంను చెల్లిస్తాయి.

కారు రుణం 

కారు రుణం లేదా ఇతర వాహనం కోసం రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. వారసుడు లేదా కుటుంబ సభ్యులు ఆ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వారు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోతే.. ఆ వాహనాన్ని బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత విక్రయించడం ద్వారా రుణం మొత్తం రికవరీ చేయబడుతుంది.

క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డుపై..

క్రెడిట్ కార్డుపై తీసుకున్న మొత్తం కూడా అప్పు కిందకే వస్తుంది. క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే.. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఎవరికి ఉండదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం