
ప్రతి వ్యక్తి తన పొదుపు మొత్తాన్ని తన పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు సురక్షితంగా, రాబడి అధికంగా ఉండే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు. అటువంటి పరిస్థితిలో పోస్టాఫీసు పెట్టుబడి పథకాలు సురక్షితమైన ఎంపిక. ఈ రోజు మనం పోస్టాఫీసుకి సంబంధించిన గొప్ప పథకం గురించి తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒకేసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 15 లక్షలు అంటే రూ. 10 లక్షల ప్రత్యక్ష ప్రయోజనం పొందవచ్చు.. ఎలా 10 లక్షలు లాభం వస్తుందంటే..
ఈ పథకం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్. దీనిని సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని కూడా పిలుస్తారు. దీనిలో ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. ఆ డిపాజిట్ పై ప్రతి సంవత్సరం వడ్డీని పొందుతారు. ఈ పథకంలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇది ప్రభుత్వ పథకం.. కనుక ఇందులో పెట్టుబడి పెట్టడం వలన డబ్బు పోతుందనే భయం ఉండదు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌పై 7.5% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది చాలా బ్యాంకులు అందించే వడ్డీ కంటే ఎక్కువ.
ఎవరైనా ఒకేసారి 5 లక్షల రూపాయలను పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాల పాటు ఉంచాలి. అప్పుడు దీనిపై సంవత్సరానికి 7.5% వడ్డీ లభిస్తుంది.
5 సంవత్సరాల తర్వాత, మీ పెట్టుబడి దాదాపు రూ.7,24,974కి పెరుగుతుంది. అయితే ఈ పతాకంలో పెట్టిన డబ్బులను వెంటనే తీసుకోవద్దు.. ఈ డబ్బును మరో 5 సంవత్సరాల పాటు అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టండి. అప్పుడు మరో 5 సంవత్సరాలలో ఈ మొత్తం రూ.10,51,175కి పెరుగుతుంది. ఇప్పుడు దానిని మళ్ళీ మూడవసారి 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయండి. ఈసారి ఈ మొత్తం దాదాపు రూ.15,24,149కి పెరుగుతుంది. అంటే మీ ప్రారంభ మొత్తం రూ.5 లక్షలు ఇప్పుడు 15 సంవత్సరాలలో మూడు రెట్లు ఎక్కువ అవుతుంది.
పోస్టాఫీస్ FDలో ఒక్కసారి మాత్రమే రూ. 5 లక్షలు డిపాజిట్ చేసి 15 సంవత్సరాలు ఈ డబ్బుని తాకకుండా ఉంచాలి. ఈ స్క్రీమ్ లో నెల నెలా ఎటువంటి వాయిదా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎటువంటి మార్కెట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయినప్పటికీ 15 సంవత్సరాల తర్వాత మీకు రూ. 15 లక్షలకు పైగా రాబడి లభిస్తోంది. అంటే రూ. 10 లక్షల ప్రత్యక్ష లాభం పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..