AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: రోజుకు రూ.333 డిపాజిట్ చేస్తే చేతికి రూ.17 లక్షలు.. అద్భుతమైన స్కీమ్

Post Office Saving Scheme: పోస్టాఫీసులోని అన్ని ఇతర పొదుపు పథకాలు రిస్క్ లేనివి, అలాగే ఆర్డీ పెట్టుబడిలో ఎటువంటి రిస్క్ ఉండదు. దీనిలో పెట్టుబడిపై ప్రభుత్వం భద్రతకు హామీ ఇస్తుంది. కానీ గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ చిన్న..

Post Office: రోజుకు రూ.333 డిపాజిట్ చేస్తే చేతికి రూ.17 లక్షలు.. అద్భుతమైన స్కీమ్
Subhash Goud
|

Updated on: Jun 16, 2025 | 5:11 PM

Share

Post Office Saving Scheme: ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేస్తారు. అలాగే వారి డబ్బు సురక్షితంగా ఉండే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అలాగే వారు మంచి రాబడిని పొందుతారు. పొదుపు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ మంచి రాబడి పొందాలంటే పోస్టాఫీసులో ఎన్నో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. దీనిలో మీరు ప్రతిరోజూ రూ.333 పెట్టడం ద్వారా రూ. 16 లక్షల మొత్తాన్ని జమ చేయవచ్చు. ఆ స్కీమ్‌ పేరే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్.

ఇది కూడా చదవండి: Health Tips: పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

మీకు 10 సంవత్సరాలలో రూ. 16 లక్షలు:

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా దేశంలోని మధ్యతరగతి ఇళ్లలో పొదుపు చేయడానికి అనేక రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. కానీ మీరు ప్రతిరోజూ చిన్న మొత్తాలను ఆదా చేయడం ద్వారా కేవలం 10 సంవత్సరాలలో రూ. 16 లక్షల మొత్తాన్ని ఆదా చేయవచ్చు. అనేక రకాల చిన్న పొదుపు పథకాలు పోస్టాఫీసులో ఉన్నాయి. వాటిలో రికరింగ్ డిపాజిట్ పథకం (RD) ప్రత్యేకమైనది. ఇందులో ప్రభుత్వం కూడా అద్భుతమైన వడ్డీని ఇస్తుంది.

100 రూపాయలతో ఖాతా ఓపెన్‌:

పోస్ట్ ఆఫీస్ ఉత్తమ చిన్న పొదుపు పథకాలలో చేర్చబడిన ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD)లో మీరు నెలకు రూ. 100 పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఖాతాను తెరవవచ్చు. సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరిచే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ పథకంపై 6.7 శాతం బలమైన కాంపౌండ్ వడ్డీ అందుకోవచ్చు. అలాగే ఈ కొత్త వడ్డీ రేటు జనవరి 1, 2024 నుండి వర్తిస్తుంది.

RDలో రిస్క్ లేని పెట్టుబడి:

పోస్టాఫీసులోని అన్ని ఇతర పొదుపు పథకాలు రిస్క్ లేనివి, అలాగే ఆర్డీ పెట్టుబడిలో ఎటువంటి రిస్క్ ఉండదు. దీనిలో పెట్టుబడిపై ప్రభుత్వం భద్రతకు హామీ ఇస్తుంది. కానీ గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ చిన్న పొదుపు ఆర్డీ పథకంలో మీరు ప్రతి నెలా సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా నెలలో వాయిదాను పెట్టుబడి పెట్టడం మర్చిపోతే, మీరు నెలకు 1% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు వరుసగా 4 వాయిదాలను మిస్ అయితే, ఈ ఖాతా స్వయంచాలకంగా క్లోజ్‌ అవుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు.

17లక్షలు సేకరించడానికి ఇదే లెక్క.

ఇప్పుడు పోస్టాఫీసులోని ఈ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 17 లక్షలు ఎలా పొందాలో చూద్దాం. మీరు ఈ పథకంలో రోజుకు రూ. 333 పెడితే ఈ మొత్తం ప్రతి నెలా దాదాపు రూ. 10,000 అవుతుంది. అంటే ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి సంవత్సరం రూ. 1.20 లక్షలు డిపాజిట్‌ చేస్తారు. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో మీరు రూ. 6 లక్షలు జమ అవుతాయి. ఇప్పుడు 6.7 శాతం చొప్పున చక్రవడ్డీతో లెక్కిస్తే అది రూ. 1,13,659 అవుతుంది. అంటే, మీ మొత్తం మొత్తం రూ. 7,13,659 అవుతుంది.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు ఉండవచ్చు. కానీ మీరు దానిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అంటే ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ.12,00000 అవుతుంది. దానిపై వచ్చే వడ్డీ రూ.5,08,546 అవుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల అనంతరం వడ్డీని కలిపిన తర్వాత మీకు మొత్తం రూ. 17,08,546 లభిస్తుంది.

ఇది కూడా చదవండి: DoT New Rule: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నెట్‌వర్క్‌ మారాలంటే 90 రోజులు కాదు.. 30 రోజులే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి