Post Office RD Scheme: ఈ పోస్టల్ పథకంలో నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే.. రూ. 96,390 లభిస్తుంది.. ఎలా అంటే..!
Post Office RD Scheme: ప్రతి ఒక్కరూ తమ డబ్బును సురక్షితంగా ఏ రిస్క్ లేని దానిలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఐతే కొన్ని సార్లు డబ్బులను లాంగ్ రన్ లో డిపాజిట్ చేస్తే..
ప్రతి ఒక్కరూ తమ డబ్బును సురక్షితంగా ఏ రిస్క్ లేని దానిలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఐతే కొన్ని సార్లు డబ్బులను లాంగ్ రన్ లో డిపాజిట్ చేస్తే.. తక్కువ వడ్డీ రేటు వస్తుంది.. అందువల్ల ఆర్ధికంగా పెద్ద ప్రయోజనం లేదంటూ.. కొంత గందర గోళానికి గురవుతారు. తమ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెడితే.. భద్రతతో పాటు సురక్షితంగా ఉంటుంది.. పెట్టుబడికి తగిన ఫలం అందుతుందని ఆలోచిస్తారు. అటువంటివారి కోసమే పోస్టాఫీస్ లోని ఓ పథకం అత్యంత ఉపయోగంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మొత్తాన్ని కూడా పొందవచ్చు.. ఆ పథకం వివరాల్లోకి వెళ్తే..
ఇప్పుడు సురక్షితం.. హామీ రాబడి కలిగిన పోస్ట్ ఆఫీస్ పునరావృత డిపాజిట్ పథకం గురించి తెలుసుకుందాం. ఈ ఖాతా 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఎవరైనా నెలకు రూ. 1500 ఈ పథకంలో జమ చేస్తే.. సంవత్సరంలో రూ. 1,278 వడ్డీ వస్తుంది అంటే.. సంవత్సరానికి రూ .18000 జమ చేస్తే, మీ డబ్బు 19278 రూపాయలు అవుతుంది. ఈ పోస్టాఫీస్ పథకంలో ఎవరైనా ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే.. ఏడాదికి రూ. 19, 278 ప్రకారం మీ ఫండ్ విలువ ఐదేళ్లకు రూ .96,390 అవుతుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి.. మీరు ప్రతి నెలా నిర్ణీత తేదీన డబ్బు జమ చేయాలి. ఈ పథకంలో, మీరు మీ డబ్బును ప్రతి నెల 1 నుండి 15 వరకు జమ చేయవచ్చు. మీరు నెల 1వ తేదీన ఖాతా తెరిచినట్లయితే.. ఆ నెల 15వ తేదీ వరకు జమ చేయవచ్చు. 16 వ తేదీన, ఓపెన్ అకౌంట్‌లో డిపాజిట్ చేయడానికి చివరి అవకాశం.
భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న 1.5 మిలియన్ పోస్టాఫీసుల్లో అనేక రకాల బ్యాంకింగ్ రంగ సేవలను అందిస్తున్నాయి. డబ్బు. హామీ రాబడితో సురక్షితమైన పెట్టుబడులను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న పోస్టాఫీస్ వేర్వేరు పథకాలను తన కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ పథకం కావడంతో ఈ స్కిం లో పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితం. పోస్ట్ ఆఫీస్ సాధారణంగా 4 శాతం నుండి 8.3 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. అయితే అది మీరు తీసుకునే పథకం పై ఆధారపడి ఉంటుంది. పథకాల గురించి మరింత సమాచారం ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఈ ఆర్డీ పథకం సురక్షితం కనుక ఎక్కువమంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..
హైదరాబాద్ బేగం బజార్ పై కరోనా సెకండ్ వేవ్ పంజా, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!