- Telugu News Business Deposit 2850 rupees premium post office gram sumangal policy and get 14 lakh maturity benefits
India Post: పోస్ట్ ఆఫీస్ సూపర్ స్కీం.. రూ.2,850 డిపాజిట్ చేస్తే.. పరిమితి తర్వాత ఎన్ని లక్షలు వస్తాయంటే..?
India Post Gram Sumangal Policy: మద్యతరగతి ప్రజలకు తపాలా జీవిత బీమా భరోసా కల్పిస్తోంది. ఉద్యోగుల కోసమే కాకుండా మధ్య తరగతి ప్రజల వృద్ధి
Updated on: Apr 08, 2021 | 3:29 PM


గ్రామ సుమంగళ్ మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని గరిష్ట మొత్తం.10 లక్షలు. మీకు మనీ బ్యాక్ కూడా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి సజీవంగా ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు మనీబ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ మరణిస్తే బీమా చేసిన నామినీకి మొత్తం బోనస్, క్లెయిమ్ లభిస్తుంది. ఈ పాలసీ ప్రకారం.. నెలకు రూ.2850 చొప్పున ప్రీమియం జమ చేస్తే.. 20 సంవత్సరాల తరువాత సుమారు రూ.14 లక్షలు అందుతాయి.

సుమంగళ్ గ్రామ్ పాలసీ 15 ఏళ్లు నుంచి 20 ఏళ్ల పరిమితి ఉంటుంది. ఈ పాలసీని కనీసం 19 ఏళ్లపాటు కొనసాగుతుంది. దీన్ని 40 ఏళ్లు వయస్సు వరకు నమోదు చేసుకోవచ్చు. 40 ఏళ్ల వయస్సులో దీనిని తీసుకుంటే.. పాలసీ గరిష్ట పరిమితి 20 ఏళ్లు. 45 ఏళ్ల వయస్సులో తీసుకుంటే.. పాలసీ గరిష్ట పరిమితి 15 ఏళ్లు.

మీరు 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే.. పాలసీ తీసుకుని 6, 9, 12 ఏళ్లు పూర్తయిన అనంతరం మీకు 20-20% హామీ లభిస్తుంది. మెచ్యూరిటీపై 40% డబ్బు తిరిగి బోనస్ గా లభిస్తుంది. పాలసీ 20 సంవత్సరాలు అయితే 8, 12, 16 సంవత్సరాలు 20-20 శాతం డబ్బు తిరిగి పొందవచ్చు. మెచ్యూరిటీపై 40% మనీబ్యాక్ లభిస్తుంది.

గ్రామ సుమంగళ్ పథకాన్ని ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ పథకానికి ప్రస్తుతం వేయికి రూ.48 బోనస్ అందుతుంది. పాలసీదారుడికి 25 ఏళ్లు ఉంటే.. అతని నెలవారీ ప్రీమియం రూ.2853 ఉంటుంది. మూడు నెలల ప్రీమియం రూ.8449, ఆరు నెలల ప్రీమియం రూ.16715, వార్షిక ప్రీమియం రూ.32735 ఉంటుంది.

పాలసీ తీసుకున్న 8,12,16 ఏళ్లల్లో మీకు 1.4-1.4 లక్షల రూపాయల చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. 20వ సంవత్సరంలో రూ.2.8 లక్షలు లభిస్తాయి. వెయ్యికి ఏడాదికి రూ.48 బోనస్ లభిస్తుంది. ఈ విధంగా రూ.7లక్షల మొత్తానికి వార్షిక బోనస్ రూ.33600. 20 ఏళ్లలో ఇది రూ.6.72 లక్షలు అవుతుంది. 20 ఏళ్లల్లో మొత్తం రూ.13.72 లక్షలు లభిస్తాయి. అయితే ఇందులో మొత్తం రూ.4.2 లక్షలలను మనీబ్యాక్ రూపంలో పొందవచ్చు.




