మీరు LIC ఖాతాదారులా ? అయితే మీకు ఇది తెలుసా ? ఎల్ఐసీలోని ఈ పెన్షన్ పథకంలో చేరితే రూ.23,000 పెన్షన్..
LIC Vaya Vandana Yojana: దేశ వ్యాప్తంగా అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అనేక రకాల స్కీమ్స్ ఉంటాయి.

LIC Vaya Vandana Yojana: దేశ వ్యాప్తంగా అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అనేక రకాల స్కీమ్స్ ఉంటాయి. టర్మ్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్ ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందుకే ఎల్ఐసీని ప్రజల నమ్మకాన్ని పొందింది. ఇక ఇందులో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పాలసీని కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ స్కీంను 2021 మార్చి 24న ప్రారంభించగా.. 2023 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీం అందరికి కాదండోయ్. కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో చేరితే వార్షిక ఆదాయం 7.66 శాతం వరకు పొందవచ్చు. ఈ పథకం టెన్యూర్ 10 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 60 ఏళ్లు కలిగిన వారు మాత్రమే ఇందులో చేరాల్సి ఉంటుంది.
ఈ పథకంలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఈ స్కీంలో భాగంగా.. నెలకు పెన్షన్ రూ.100, సంవత్సరానికి రూ.12,000 ఇవ్వనుంది. నెలకు గరిష్టంగా రూ.9250 పెన్షన్ వస్తుంది. అలాగే మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలనుకుంటే రూ.162 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే నెలకురూ.9250 పెన్షన్ కావాలనుకుంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అలాగే సంవత్సరానికి రూ.12,000 పెన్షన్ కావాలనుకుంటే రూ.1.56 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా.. సంవత్సరానికి రూ.1.11 లక్షల వరకు పెన్షన్ కావాలనుకుంటే రూ.14.50 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది.
ఇవే కాకుండా ఈ పథకంలో మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇందులో చేరిన వ్యక్తి మధ్యలోనే చనిపోతే.. ఇన్వేస్ట్ చేసిన డబ్బును నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. అదే పది సంవత్సరాలు తర్వాత కూడా బ్రతికి ఉంటే కట్టిన డబ్బులు వారికే ఇచ్చేస్తారు. ఇందులో లోన్ కూడా తీసుకోవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత లోన్ పొందవచ్చు. 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. లోన్ అప్లై చేసినప్పుడు ఉదాహరణకు 2021 ఏప్రిల్ 30న వడ్డీ రేటు సంవత్సరానికి 9.5 శాతం. పాలసీ హోల్డరుకు ఈ పథకం నచ్చకపోతే… అతను కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో ఈ పాలసీని తిరిగి ఇవ్వవచ్చు. ఇక మీరు ఆన్ లైన్ లో లోను తీసుకుంటే మీకు 30 రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నెలకు పెన్షన్ వెయ్యి కావాలనుకుంటే.. రూ.74 కట్టాలి. మూడు నెలలకు పెన్షన్ 74.50, ఆరు నెలలకు పెన్షన్ రూ.75.20, సంవత్సరానికి పెన్షన్ రూ.76.60. ఉదాహరణకు ఇందులో మీరు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారనుకొండి.. పెన్షన్ డబ్బులు సంవత్సరం చొప్పున పొందాలనే ఆప్షన్ ఎంచుకున్నారు. దీంతో మీకు దాదాపు రూ.23.000 వరకు పెన్షన్ వస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.2 వేలు లభిస్తాయన్న మాట.
Also Read: రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..




