Investment Tips: రోజుకు రూ.100 ఆదా చేస్తే.. రూ.5 లక్షలు మీ చేతికి.. మార్కెట్లో బెస్ట్ స్కీమ్ ఇదే..
పోస్టాఫీసులో అనేక స్కీములు ఉన్నాయి. వాటిల్లో బాగా పాపులర్ అయిన పథకం నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్. ఈ అకౌంట్లో చిన్న మొత్తం నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. చిన్న పిల్లల పేర్లపై కూాడా తల్లిదండ్రులు ఈ ఖాతా తెరవొచ్చు. మరిన్ని వివరాలు చూస్తే..

దేశంలో పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు బాగా పాపులర్ అయ్యాయి. నగదుకు భద్రతతో పాటు కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది. దీంతో పోస్టాఫీస్ స్కీమ్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ పోస్టాఫీసు పథకాల్లో భాగా పాపులర్ అయింది. దీనిని పోస్టాఫీస్ RDగా పిలుస్తున్నారు. నెలకు కేవలం రూ.100 పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. నెలకు రూ.3 వేల పెట్టుబడితో రూ.5 లక్షల వరకు సంపాదింవచ్చు. ఈ పథకంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 6.7 శాతం వడ్డీ రేటు, రుణం తీసుకునే సౌకర్యం, మెచ్యూరిటీ తర్వాత అకౌంట్‌ను పొడిగించుకునే అవకాశం లాంటివి చాలానే ఉన్నాయి.
ప్రతీ నెలా రూ.3 వేలు ఆదా చేస్తే..
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. మీరు రోజుకు రూ.100 ఆదా చేసే నెలకు రూ.3 వేలు అవుతుంది. 10 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగిస్తే మొత్తం రూ.3.60 లక్షలు అవుతుంది. 6.7 వార్షిక వడ్డీ ప్రకారం లెక్కిస్తే 10 ఏళ్లల్లో రూ.1,52,565 పొందుతారు. 10 ఏళ్లు ముగిశాక అసలు, వడ్డీ కలిపి రూ. 5,12,565 మీకు ఒకేసారి అందుతుంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏ భారత పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. కనీస పెట్టుబడి కేవలం రూ.100 నుండి స్టార్ట్ చేయవచ్చు. అయితే దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మీరు ఎంత అయినా పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల పేరు మీద కూడా తల్లిదండ్రులు ఈ అకౌంట్ తెరవొచ్చు. పిల్లల వయస్సు 10 ఏళ్లు దాటితే నేరుగా వారి పేరు మీద ఓపెన్ చేయవచ్చు.
50 శాతం రుణం తీసుకోవచ్చు
ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత.. మీరు వరుసగా 12 వాయిదాలు చెల్లించి ఉంటే..మీ మొత్తం డిపాజిట్‌లో 50 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. ఈ రుణంపై నిర్ణీత ఆర్డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు. రుణాన్ని ఒకేసారి లేదా నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించే అవకాశం అందుబాటులో ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే ఖాతా మెచ్యూరిటీ సమయంలో మీకు అందే తుది నిధి నుండి బకాయి ఉన్న మొత్తాన్ని తీసివేస్తారు.
