Auto News: అత్యంత పవర్‌ఫుల్ కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం.. ధర ఎంతో తెలుసా?
పోర్స్చే కొత్త కారు క్యాబిన్ టర్బోక్‌నైట్ ఇంటీరియర్ ట్రిమ్‌తో వస్తుంది. ఈ కారులో GT స్పోర్ట్ స్టీరింగ్ వీల్ ఉంది. Auto News: డ్యాష్‌బోర్డ్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ ,అనలాగ్ క్లాక్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్పోర్ట్ సీట్లు..

Auto News: పోర్స్చే భారతదేశంలో అప్‌డేట్ చేసిన 911 టర్బో ఎస్‌ను విడుదల చేసింది. ఈ కారు కొన్ని నెలల క్రితం జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన IAA మొబిలిటీ 2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కారు పోర్స్ అత్యంత శక్తివంతమైన 911 మోడల్. ఇది T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. భారతదేశంలో ఈ రెండు-డోర్ల కూపే ఎక్స్-షోరూమ్ ధర రూ.3.80 కోట్లు. ఇది భారతదేశంలో పోర్స్చే అత్యంత ఖరీదైన కారు. ఇది విలాసవంతమైన అనుభూతి, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది.
పోర్స్చే కొత్త కారు పవర్:
పోర్షే 911 టర్బో ఎస్ కారులో 3.6-లీటర్ ఫ్లాట్-సిక్స్ హైబ్రిడ్ ఇంజిన్, టి-హైబ్రిడ్ సిస్టమ్ జతచేయబడి ఉంటుంది. పోర్షే కారులోని అదనపు టర్బోచార్జర్ 711 బిహెచ్‌పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానించి ఉంటుంది.
ఇది కూడా చదవండి: BSNLతో Jio కీలక ఒప్పందం.. ప్లాన్ మామూలుగా లేదుగా.. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌తో జియో కాలింగ్
911 టర్బో S లోని ఈ ఇంజిన్ ఈ పోర్స్చే కారును కేవలం 2.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి అనుమతిస్తుంది. ఈ పోర్స్చే కారు గరిష్టంగా 322 కి.మీ. వేగాన్ని కూడా అందుకోగలదు. ఈ కారు మునుపటి 911 టర్బో S కంటే 14 సెకన్లు వేగంగా వేగాన్ని అందుకుంటుంది. ఈ పోర్స్చే కారు లగ్జరీ లక్షణాల కలయిక మాత్రమే కాదు, శక్తి , పనితీరులో కూడా ముందుంటుంది.
911 టర్బో S ప్రీమియర్ ఇంటీరియర్
పోర్స్చే కొత్త కారు క్యాబిన్ టర్బోక్‌నైట్ ఇంటీరియర్ ట్రిమ్‌తో వస్తుంది. ఈ కారులో GT స్పోర్ట్ స్టీరింగ్ వీల్ ఉంది. డ్యాష్‌బోర్డ్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ ,అనలాగ్ క్లాక్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్పోర్ట్ సీట్లు, డిజిటల్ క్లస్టర్ , డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








