AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Cars: వామ్మో ఇంత ఖరీదా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 3 కార్లు.. ధర రూ.230 కోట్లు

Most Expensive Cars: రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన కారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కారు అని పిలుస్తారు. బ్లాక్ బక్కారా గులాబీ పువ్వు నుండి ప్రేరణ పొందిన ఈ కారులో క్లిష్టమైన చేతితో చెక్కబడిన రోజ్‌వుడ్ ఉంది...

Most Expensive Cars: వామ్మో ఇంత ఖరీదా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 3 కార్లు.. ధర రూ.230 కోట్లు
Subhash Goud
|

Updated on: Nov 14, 2025 | 11:37 AM

Share

Most Expensive Cars: ప్రపంచంలో చాలా కార్లు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కార్లు మరే ఇతర కారులోనూ అందుబాటులో లేని అనేక లక్షణాలను అందిస్తున్నాయి. ప్రయాణీకులకు ఇంటి కంటే ఎక్కువ సౌకర్యాన్ని అందించే కార్లు ప్రపంచంలో కూడా ఉన్నాయి. కానీ ఈ లగ్జరీ కార్ల ధర కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ధర 2 బిలియన్ రూపాయలు దాటింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు అయిన అలాంటి లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ధర..

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ బోట్ టెయిల్. ఈ కారు ధర దాదాపు రూ.230 కోట్లు (సుమారు $2.3 బిలియన్లు). ఈ కారు కొన్ని నమూనాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తయారు చేసింది కంపెనీ. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది పూర్తిగా చేతితో నిర్మించినది. ఇది లగ్జరీ బోట్ అనుభూతిని ఇస్తుంది. ఇది సూపర్ లగ్జరీ కారు. ఇది 563 bhp ఉత్పత్తి చేసే 6.75-లీటర్ V12 ట్విన్-టర్బో ఇంజిన్‌తో శక్తినిస్తుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రూ.4000 పీఎం కిసాన్‌ డబ్బులు!

అత్యంత ఖరీదైన కారు

బుగట్టి లా వోయిచర్ నోయిర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన కారు. దీని ధర సుమారు రూ.160 కోట్లు. ఇది లగ్జరీ, పనితీరు రెండింటినీ కోరుకునే వారి కోసం రూపొందించారు. ఇది 1,500 hp ఉత్పత్తి చేసే 8.0-లీటర్ క్వాడ్-టర్బో W16 ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 2.5 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. బుగట్టి నుండి వచ్చిన ఈ లగ్జరీ కారు గరిష్ట వేగం గంటకు 420 kmph.

రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్:

రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన కారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కారు అని పిలుస్తారు. బ్లాక్ బక్కారా గులాబీ పువ్వు నుండి ప్రేరణ పొందిన ఈ కారులో క్లిష్టమైన చేతితో చెక్కబడిన రోజ్‌వుడ్ ఉంది. ఈ కారు ఒకే ఒక మోడల్ ప్రపంచంలో ఉత్పత్తి చేయబడింది.

Gold Price Update: అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం