AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్.. అప్లై చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తోంది. కేవలం 5 శాతం వడ్డీకే రుణం పొందవచ్చు. ఇందుకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో కేంద్రం రుణం అందిస్తోంది. వీటి వివరాలు చూస్తే..

Central Government: కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్.. అప్లై చేసుకోండిలా..
Money 5
Venkatrao Lella
|

Updated on: Apr 22, 2026 | 8:46 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కమ్మరి, క్షౌరవృత్తి, ముత్యాల తయారీ, వడ్రంగి, మట్టి పాత్రలు, తాళాలు తయారీ, తాపీ, పడవల తయారీ, శిల్పులు, చేపల వలల తయారీ, బొమ్మల తయారీ, మట్టి పాత్రల తయారీ వంటి చేతి వృత్తులు చేసే కళాకారులకు కేంద్రం రూ.3 లక్షల రుణం అందిస్తోంది. ఈ స్కీమ్‌లో మొత్తం 18 వ్యాపారాలను చేర్చింది. ఈ చేతివృత్తుల వ్యాపారం చేసేవారికి మాత్రమే విశ్వకర్మ యోజన ద్వారా కేంద్రం లోన్ అందిస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. సాంప్రదాయ వృద్దులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకం అమలు చేస్తోంది.

ఎలాంటి పూచీకత్తు లేకుండా..

వ్యాపారం, అర్హతను బట్టి రూ.3 లక్షల వరకు రుణం విశ్వకర్మ యోజన పథకం ద్వారా పొందవచ్చు. ఈ లోన్‌కు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఎలాంటి హమీ లేకుండా ఈ రుణాన్ని అర్హులు పొందవచ్చు. ఈ లోన్ రెండు విడతలుగా అందిస్తారు. తొలి విడతలో వ్యాపారం స్టార్ట్ చేయడానికి రూ.లక్ష మంజూరు చేస్తారు. అనంతరం వ్యాపార విస్తరణ కోసం రూ.2 లక్షలు అందిస్తారు. అయితే ఈ రుణానికి వడ్డీ కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. ఈ లోన్ పొందేందుకు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి హామీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. గ్యారంటీ రహితంగా అందించే లోన్‌గా దీనిని చెప్పవచ్చు. చేతివృత్తుల్లో నైపుణ్యం ఉండి వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి ఈ రుణం మంజూరు చేస్తారు.

ఈ డాక్యుమెంట్స్ అవసరం

ఈ పథకం కింద లోన్ పొందాలంటే వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. pmvishwakarma.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హోమ్ పేజీలో అప్లై ఆన్ లైన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ మొబైల్‌కు వస్తాయి. ఆ తర్వాత వాటితో లాగిన్ అయ్యి దరఖాస్తు పూర్తి చేయండి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి. ఇక ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. సెప్టెంబర్ 17,2023లో ఈ పథకం ప్రారంభించగా.. ఇప్పటివరకు 30 లక్షల మంది దరాఖాస్తు చేసుకున్నారు. వీరిలో 26 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.

Follow Us