Central Government: సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి నేరుగా రూ.78 వేలు.. ఒక్కొక్కరికీ..
కేంద్ర ప్రభుత్వ సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రూ.78 వేల వరకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ సొమ్ముతో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.

దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక పథకాన్ని అమలు చేస్తోంది. అదే పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకం. 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా లబ్దిదారులు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశముంది. అయితే ఈ పథకం ద్వారా పేదలు సోలార్ రూఫ్ టాప్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. నేరుగా లబ్దిదారుడి అకౌంట్లో ఈ సొమ్మును జమ చేస్తోంది. అంతేకాకుండా ఇంటికి సరిపోగా మిగిలిన విద్యుత్ ను డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. నెట్ మీటరింగ్ విధానం ద్వారా డిస్కంలకు విక్రయించవచ్చు.
సబ్సిడీ ఎంత వస్తుందంటే..?
సబ్సిడీ విషయానికొస్తే.. 1 నుంచి 7 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు సబ్సిడీ అందుతుంది. ఇక 2 నుంచి 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ కు రూ.60 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. అదే 3 కిలోవాట్లపైబడి ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది.
అర్హతలు ఇవే..
-భారత పౌరులు అయి ఉండాలి
-సొంత ఇల్లు కలిగి ఉండాలి
-ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కలిగి ఉండాలి
-గతంలో ప్రభుత్వం నుంచి సోలార్ ప్లాంట్ సబ్సిడీ పొంది ఉండకూడదు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
-pmsuryaghar.gov.in వెబ్ సైట్ సందర్శించండి
-రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు అనే ఆప్షన్ ఎంచుకోండి
-అవసరమైన వివరాలు నమోదు చేయండి
-ఎలక్ట్రిసిటీ కన్జూమర్ నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి
-దరఖాస్తు ఫారం నింపండి
-డిస్కం మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. పోర్టల్ లో నమోదైన వెండర్ ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి
-సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాక పోర్టల్ లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
-నెట్ మీటర్ అమర్చిన తర్వాత డిస్కం అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికేట్ అందిస్తారు.
-అనంతరం బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సిల్ చెక్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి
-30 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి
