AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!

PM-KISAN పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులతో సాగు భూమిని కలిగి ఉండాలి. అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించానికి రైతులు..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!
వీరికి ఈ విడత రాదు: మీరు PM కిసాన్ యోజన కింద మీ e-KYCని ఇంకా పూర్తి చేయకపోతే మీ డబ్బు రాకపోవచ్చు. e-KYC లేకుండా ఎటువంటి వాయిదాలు బదిలీ చేయబడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా, మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే డబ్బు బదిలీ కావని గుర్తించుకోండి.
Subhash Goud
|

Updated on: Sep 26, 2025 | 6:55 PM

Share

PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు 20వ విడత వరకు రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21 విడత రావాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని రైతుల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరదలు, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో ముందస్తుగా ఈ విడతను విడుదల చేశారు. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని రైతులకు రూ.540 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇది కూడా చదవండి: RBI: ఆర్‌బీఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా? అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?

27 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం:

ఈ విడతను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడినందున ఆయా రాష్ట్రాల రైతుల ఖాతాలకు ప్రత్యేకంగా బదిలీ చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు 2.7 మిలియన్ల మంది మహిళా రైతులతో సహా 2.7 మిలియన్లకు పైగా రైతులు రూ.540 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

iPhone: మీ ఐఫోన్‌ వేడెక్కుతోందా? ఇలా చేయండి..!

ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, రూ. 2,000 విడత రైతులకు తక్షణ గృహ అవసరాలను తీర్చడానికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించడానికి వారి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుందని హైలైట్ చేశారు.

పీఎం కిసాన్ అంటే ఏమిటి?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో ప్రతి విడత నాలుగు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది.

PM-కిసాన్ పథకానికి అర్హత:

PM-KISAN పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులతో సాగు భూమిని కలిగి ఉండాలి. అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించానికి రైతులు తమ ఆధార్ నంబర్‌ను వారి బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. అలాగే e-KYC ధృవీకరణను పూర్తి చేయాలి. పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు లేదా ప్రభుత్వ/ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో పనిచేసే రైతులు ఈ పథకానికి అర్హులు కారు.

ఎలా తనిఖీ చేయాలి?

  • అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • లబ్ధిదారు స్థితి పేజీకి వెళ్లండి.
  • “లబ్ధిదారు స్థితి” పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
  • “డేటా పొందండి” పై క్లిక్ చేయండి.
  • లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేయండి.
  • చెల్లింపు స్థితిని తనిఖీ చేయండి.
  • సిస్టమ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: Amazon Great Indian Festival: అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్లు.. సౌండ్‌ బార్లపై 80% తగ్గింపు