AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు అలర్ట్.. వచ్చే నెలలో 10వ విడత డబ్బులు.. అందుకు ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా

PM Kisan: రైతులకు అలర్ట్.. వచ్చే నెలలో 10వ విడత డబ్బులు.. అందుకు ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందే..
Pm Kisan
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 22, 2021 | 12:21 PM

Share

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించనుంది. పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతలకు ఏడాదికి రూ. 6 వేలు వారి బ్యాంక్ అకౌంట్లోకి రానున్నాయి. ఈ నగదు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమనున్నాయి. ఇప్పటివరకు 9 విడతలను రైతులు అందుకున్నారు. ఇక పదవ విడత నగదు డిసెంబర్ 15న రానున్నట్లుగా సమాచారం. పీఎం కిసాన్ నగదు.. లేదా లబ్ధిదారుల స్థితి.. ఇంక మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి pmkisan.gov.inలో పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‏లో చెక్ చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ నగదు కోసం ఎదురుచూస్తున్న రైతులు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకోని వారు కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. అవి.. 1. పేరు, వయసు, లింగం, వర్గం (ఎస్సీ/ఎస్టీ) 2. ఆధార్ నంబర్/ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ల ఐడీ కార్డ్, ఎన్ఆర్ఇజీఏ జాబ్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు పత్రాలు మొదలైనవి. 3. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్ 4. మొబైల్ నంబర్ తప్పనిసరి కాదు.

ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు అర్హులు కాదు. రాజ్యాంగ పదువులు ఉన్నవారు అర్హులు కాదు. అలాగే ప్రస్తుత.. మాజీ రాజకీయ నాయకులు అర్హులు కాదు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాలలో.. వారి ఫీల్డ్ యూనిట్స్, కేంద్ర, రాష్ట్ర పీఎస్ఈలు, ప్రభుత్వ పరిధిలోని అనుబంధ కార్యాలయాలు .. స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు అర్హులు కాదు. పదవి విరమణ పొందిన వారు కూడా అర్హులు కాదు.. నెలవారీ పెన్షన్ రూ. 10 వేలు.. లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులు మినహాయించి మిగిలిన పదవి విరమణ .. రిటైర్డ్ పెన్షనర్లు అర్హులు కాదు. అలాగే గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు కూడా. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్ కూడా అర్హులు కాదు. పీఎం కిసాన్ పోర్టల్ లో కొత్త లబ్ధిదారులను అప్లోడ్ చేసినట్లయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిబంధనల ప్రకారం ప్రవాస భారతీయులు భూమిని కలిగిన రైతులు ఈ పథకం నుంచి మినహాయించబడతారు.

Also Read: Marakkar Movie: తెలుగులో విడుదల కానున్న మోహన్ లాల్ సినిమా.. మరక్కార్ రిలీజ్ ఎప్పుడంటే..

Lijomol Jose: జైభీమ్ సినిమా కోసం ఎలుకల కూర తిన్నాను.. షాకింగ్ విషయాలను చెప్పిన సినతల్లి..

Jai Bhim: జైభీమ్ సినిమా వివాదంపై స్పందించిన డైరెక్టర్.. కావాలని సూర్యను టార్గెట్ చేస్తున్నారంటూ..