EPFO 3.0: పీఎఫ్ విత్‌డ్రాపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఏటీఎం నుంచి విత్‌డ్రా సాధ్యమేనా..?
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. వీరికి రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ఈపీఎఫ్ఓను అప్‌డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ఎప్పటినుంచో ఈపీఎఫ్ఓ 3.0 అమలు చేస్తామని చెబుతుంది.

ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు త్వరలో తమ పీఎఫ్ పొదుపులను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈపీఎఫ్ఓ వెర్షన్ 3.0 ఒక ప్రధాన టెక్ అప్‌గ్రేడ్ మే లేదా జూన్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఏటీఎం ఆధారిత నిధుల ఉపసంహరణలతో సహా అనేక సరళీకృత సేవలను తీసుకువస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పీఎఫ్ ఉపసంహరణల కోసం క్లెయిమ్‌లను దాఖలు చేసి, ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. కానీ వెర్షన్ 3.0లో ఈ వ్యవస్థ క్లెయిమ్‌ల ఆటో-సెటిల్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది.
దేశంలో ఉన్న 9 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని మార్చడమే ఈపీఎఫ్ఓ3.0 లక్ష్యమని మాండవియా స్పష్టం చేశారు. ఇకపై చందాదారులు డిజిటల్‌గానే ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణతో చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలనుఅప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే వారి పెన్షన్ హక్కులను పర్యవేక్షించవచ్చు. లేదా నిధులను ఉపసంహరించుకోవచ్చు. క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించడం వల్ల నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలో త్వరగా జమవుతాయని మాండవియా పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం రూ.27 లక్షల కోట్ల కార్పస్‌ను కలిగి ఉంది. అలాగే సావరిన్ గ్యారెంటీతో 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో యజమానులు దాఖలు చేసిన 1.25 కోట్ల ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్‌లు (ఈసీఆర్‌లు) ద్వారా రూ.3.41 లక్షల కోట్లకు పైగా విరాళాలను సేకరించింది.
కీలక అప్‌గ్రేడ్స్ ఇవే
ఈపీఎఫ్ఓ మునుపటి వెర్షన్ 2.01 అమలుతో ఫిర్యాదుల పరిష్కారం గణనీయంగా మెరుగుపడిందని మంత్రి మాండవియా పేర్కొన్నారు. ముఖ్యంగా ఫిర్యాదులను సగానికి తక్కువకు తగ్గాయని వివరించారు. అయితే 3.0 ద్వారా సేవలను మరింత స్పష్టమైన, స్వీయ-ఆధారితంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. కవరేజ్, యాక్సెసిబిలిటీని పెంచడానికి అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృత వేదిక కిందకు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ఇప్పటికే భారతదేశం అంతటా ఏ బ్యాంకు ఖాతాలోనైనా తమ నెలవారీ పెన్షన్లను సదుపాయం అందుబాటులో ఉంది.
ఈఫీఎఫ్ఓతో పాటు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్సను పొందగలరని మాండవీయ ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకువస్తామని వివరించారు. ప్రస్తుతం ఈఎస్ఐసీ 165 ఆసుపత్రులు, 1,500 కి పైగా డిస్పెన్సరీలు, దాదాపు 2,000 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల ద్వారా సుమారు 18 కోట్ల మందికి సేవలందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








