LPG, Petrol, Diesel: ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన..!
LPG, Petrol, Diesel: చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇస్తూ, ప్రజలు భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయవద్దని, తమకు అవసరమైనంత ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి అందుబాటులో ఉన్నాయని, వాటిని..

LPG, Petrol, Diesel: గత వారం నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచిన తర్వాత తాజాగా మళ్లీ ధరలను పెంచింది కేంద్రం. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటి కొరత లేదని మోదీ ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని హామీ ఇస్తూ, భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రభుత్వ చమురు, గ్యాస్ నిల్వల వివరాలను తెలియజేస్తూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ , ఎల్‌పిజి, సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. భారతదేశంలో అన్ని నిత్యావసర ఇంధనాల సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున, ఎల్‌పిజి పంపిణీదారులు, రిటైల్ అవుట్‌లెట్లు లేదా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: Business Idea: బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..!
చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇస్తూ, ప్రజలు భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయవద్దని, తమకు అవసరమైనంత ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగదారులకు సకాలంలో అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని సుజాత శర్మ ఇంకా తెలిపారు. అంతేకాకుండా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి), ఇండక్షన్ , ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ వంట పద్ధతులను ఎక్కువగా అవలంబించేలా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Toilet Sheet: మీ టాయిలెల్ సీటులో కప్పు ఐస్ క్యూబ్స్ వేస్తే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




