AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..!

Business Idea: తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, తక్కువ రిస్క్‌తో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి బాతుల పెంపకం ఒక తిరుగులేని లాభదాయకమైన మార్గం. ప్రభుత్వాలు కూడా జాతీయ పశుధన మిషన్ కింద ఇలాంటి వ్యాపారాలకు సబ్సిడీలు, రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి.

Business Idea: బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..!
Duck Farming
Subhash Goud
|

Updated on: May 19, 2026 | 12:20 PM

Share

Business Idea: ప్రస్తుత రోజుల్లో వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పశుపోషణ, కోళ్ల పెంపకం వైపు రైతులు, యువత మొగ్గు చూపుతున్నారు. అయితే, కోళ్ల పెంపకం (Poultry Farming) కంటే కూడా బాతుల పెంపకం (Duck Farming) చాలా సులభం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు, చిన్నకారు రైతులకు ఇది ఒక అద్భుతమైన స్వయం ఉపాధి మార్గం.

ఇది కూడా చదవండి: Toilet Sheet: మీ టాయిలెల్‌ సీటులో కప్పు ఐస్‌ క్యూబ్స్ వేస్తే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

1. బాతుల పెంపకం ఎందుకు లాభదాయకం?

రోగనిరోధక శక్తి ఎక్కువ: కోళ్లతో పోలిస్తే బాతులకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. వీటికి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే మందుల ఖర్చు తప్పుతుంది. సాధారణ కోళ్లు ఏడాదికి 150-200 గుడ్లు పెడితే, మంచి జాతి బాతులు ఏడాదికి 300 వరకు గుడ్లు పెడతాయి. బాతు గుడ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అలాగే మార్కెట్‌లో కోడి గుడ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. బాతులు దాదాపు 2 సంవత్సరాల పాటు స్థిరంగా గుడ్లు పెడతాయి.

2. వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?

ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున కాకుండా కేవలం 20 నుండి 25 బాతులతో మీ ఇంటి పెరట్లోనే చిన్నగా ప్రారంభించవచ్చు. అనుభవం వచ్చాక సంఖ్యను పెంచుకోవచ్చు. బాతులకు ఈత కొట్టడానికి చిన్న నీటికుంట లేదా చెరువు ఉంటే మంచిది. ఒకవేళ చెరువు లేకపోయినా, ఫామ్‌లో చిన్న కృత్రిమ వాటర్ ట్యాంక్ లేదా ఛానల్ ఏర్పాటు చేసి కూడా వీటిని పెంచవచ్చు.

3. ఉత్తమమైన బాతు జాతులు:

లాభాలు ఎక్కువగా రావాలంటే సరైన జాతిని ఎంచుకోవడం ముఖ్యం. ‘ఖాకీ క్యాంప్‌బెల్’ ‘ఇండియన్ రన్నర్’ జాతులు గుడ్ల ఉత్పత్తికి అత్యుత్తమమైనవి. ‘వైట్ పెకిన్’ జాతి బాతులు త్వరగా బరువు పెరుగుతాయి. ఇవి మాంసం వ్యాపారానికి అనుకూలం.

4. ఆహారం, నిర్వహణ:

బాతులు సహజంగానే చెరువుల్లోని కీటకాలు, నత్తలు, చిన్న చిన్న చేపలు, నాచు, ధాన్యాలను తింటాయి. దీనివల్ల వీటికి పెట్టే మేత ఖర్చు (Feed Cost) చాలా వరకు తగ్గుతుంది. కోళ్ల ఫీడ్‌తో పోలిస్తే బాతుల మేత ఖర్చు తక్కువ. మార్కెట్ వ్యర్థాలు, కూరగాయల ముక్కలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

5. ఆదాయం, మార్కెటింగ్:

ఈ వ్యాపారంలో రెండు రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి గుడ్ల అమ్మకం, రెండు మాంసం అమ్మకం. బాతు గుడ్లకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లు, బేకరీలు, పౌష్టికాహారం కోరుకునే వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఒక చిన్న యూనిట్‌తో ప్రారంభించి, సరైన పద్ధతులు పాటిస్తే నెలకు క్రమబద్ధమైన, స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, తక్కువ రిస్క్‌తో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి బాతుల పెంపకం ఒక తిరుగులేని లాభదాయకమైన మార్గం. ప్రభుత్వాలు కూడా జాతీయ పశుధన మిషన్ కింద ఇలాంటి వ్యాపారాలకు సబ్సిడీలు, రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఒక బాతు పిల్ల ధర సుమారు రూ. 150 – రూ. 200 వరకు ఉంటుందని, మొత్తంగా 100 బాతుల పెంపకం ప్రారంభించడానికి రూ. 35,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే లాభాల విషయాకొస్తే మార్కెట్‌ రేటు పరంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో బాతులను పెంపకం చేస్తే లక్షల్లో సంపాదించవచ్చని బాతు పెంపకందారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
గుజరాత్‌తో చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ధైర్యం తోడుగా.. మూసీ నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ!
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
ఒకప్పుడు ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. ఇప్పుడు జబర్దస్త్‌లో
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..
బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన..
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!