AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: పెట్రోల్ ధ‌ర‌ల‌ పెరుగుదుల‌కు బ్రేక్ ప‌డేదెన్న‌డు.? ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా పెరిగిన రేట్స్‌..

Petrol Diesel Price Today: ఓవైపు క‌రోనా క‌ష్ట క‌లం మ‌రో వైపు పెరుగుతోన్న ధ‌ర‌లు వెర‌సి సామాన్యుడి జీవిత‌మే ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. వంట నూనెల నుంచి ఇంధ‌న ధ‌ర‌ల వ‌ర‌కు భ‌గ్గుమంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు...

Petrol Diesel Price: పెట్రోల్ ధ‌ర‌ల‌ పెరుగుదుల‌కు బ్రేక్ ప‌డేదెన్న‌డు.? ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా పెరిగిన రేట్స్‌..
Fuel Price Increasing
Narender Vaitla
|

Updated on: Jun 01, 2021 | 6:48 AM

Share

Petrol Diesel Price Today: ఓవైపు క‌రోనా క‌ష్ట క‌లం మ‌రో వైపు పెరుగుతోన్న ధ‌ర‌లు వెర‌సి సామాన్యుడి జీవిత‌మే ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. వంట నూనెల నుంచి ఇంధ‌న ధ‌ర‌ల వ‌ర‌కు భ‌గ్గుమంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. ప్ర‌తీరోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. వంద దాటేసింది. సోమ‌వారంతో పోలీస్తే ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎంత‌లా పెరిగాయో ఇప్ప‌డు చూద్దాం.

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 94.23 గా ఉండ‌గా (సోమ‌వారం రూ. 93.94 ), డీజిల్ రూ. 85.15 (సోమ‌వారం రూ. 84.89 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.47 గా న‌మోదుకాగా (సోమ‌వారం రూ. 100.19 ), ఇక ఇక్క‌డ డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీ ప‌డీ మ‌రీ పెరుగుతోంది. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.45 (సోమ‌వారం రూ. 92.17 ) ఉంది.

* జైపూర్‌లో కూడా లీట‌ర్ పెట్రోల్ సెంచ‌రీ దాటేసింది. ఈ రోజు ఇక్క‌డ పెట్రోల్ ధ‌ర రూ. 100.75 గా ఉండ‌గా (సోమ‌వారం రూ. 100.44 ), డీజిల్ ధ‌ర రూ. 93.95 (సోమ‌వారం రూ. 93.66 ) వద్ద కొన‌సాగుతోంది.

* ఇక త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.47 గా ఉండ‌గా (సోమ‌వారం రూ. 100.19 ), డీజిల్ రూ. 89.90 (సోమ‌వారం రూ. 89.65 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 97.37 గా న‌మోదుకాగా (సోమ‌వారం రూ. 97.07 ), లీటర్ డీజిల్ ధ‌ర రూ. 90.27 (సోమ‌వారం రూ. 89.99 ) వ‌ద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 97.93 గా ఉండ‌గా.. (సోమ‌వారం రూ. 97.63 ), డీజిల్ ధ‌ర రూ. 92.83 (సోమ‌వారం రూ. 92.54) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* తెలంగాణ‌లో మ‌రో ముఖ్య‌ ప‌ట్ట‌ణ‌మైన క‌రీంన‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.09 గా ఉండ‌గా (సోమ‌వారం రూ. 97.79 ), డీజిల్ ధ‌ర రూ. 92.96 (సోమ‌వారం రూ. 92.68 ) గా ఉంది.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంధ‌న ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్ర‌లో ధ‌ర రూ. 100.35 (సోమ‌వారం రూ. 99.96 )గా ఉండ‌గా.. డీజిల్ రూ. 94.66 (సోమ‌వారం రూ. 94.27 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* సాగ‌గ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ లీట‌ర్ రూ. 99.39 గా ఉండ‌గా (సోమ‌వారం రూ. 98.86 ), డీజిల్ ధ‌ర రూ. 93.71 (సోమ‌వారం రూ. 93.22) వ‌ద్ద కొన‌సాగుతోంది.

Also Read: Allopathy treatment : బ్లాక్ డే : బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆలోపతి వైద్యుల దేశవ్యాప్త నిరసన

vamshi paidipally : నేను కథలను రాయలేను.. అందుకే నా సినిమాలు ఆలస్యం అవుతాయి.. ఆసక్తికర విషయాలు తెలిపిన వంశీ పైడిపల్లి

Navdeep Saini: లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చుని హల్‌చల్..