Bank Account Tips: మీకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందా..? అందులోని డబ్బులు ఎలా తీసుకోవాలంటే..?
మీ బ్యాంక్ అకౌంట్‌ను కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు పర్మినెంట్‌గా క్లోజ్ చేసే అధికారం ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు అకౌంట్‌ను కొన్నేళ్ల పాటు వాడకపోయిన పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసివేయవచ్చు.

మీరు కొన్నేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకపోయినా లేదా ఈకేవైసీ అప్డేట్ చేయకపోయినా, చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడినా బ్యాంకులు మీ ఖాతాను మూసివేసే అవకాశముంది. ఒక్కొసారి మీ అనుమతి లేకుండా, మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వివిధ కారణాల వల్ల బ్యాంకులు అకౌంట్‌ను నిలిపేయవచ్చు కూడా. కొన్ని పరిస్థితుల్లో ముందస్తు హెచ్చరిక లేకుండా అకౌంట్‌ను అకస్మాత్తుగా మూసివేసే హక్కు బ్యాంకులకు నియమ, నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి..? బ్యాంకులు అకౌంట్‌ను ఎందుకు సడెన్‌గా ఆపేస్తాయి? ఒకవేళ మూసివేసిన బ్యాంక్ అకౌంట్‌లో నగదు ఉంటే తిరిగి ఎలా తీసుకోవాలి? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందే
ఒకవేళ మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్ మూసివేశారనుకుందాం. మీ డెబిట్ కార్డు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు అన్నీ నిలిచిపోాతాయి. అప్పుడు మీరు ఆ అకౌంట్లోని డబ్బులను తీసుకోలేరు. ఇలాంటి సమయంలో మీ ఖాతాలో డబ్బు ఉంటే బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వాటిని ఖచ్చితంగా బ్యాంకులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. చెక్కు రూపంలో లేదా వేరే బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ ఆ బ్యాంకుతో లింక్ అయి ఉన్న క్రెడిట్ కార్డులను మూసివేయడం, ఓవర్ డ్రాఫ్ట్ ఫీజు బకాయిలు ఉండటం ఉంటే సిబిల్‌కు బ్యాంకులు రిపోర్ట్ చేస్తాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్ తగ్గడానికి దారితీస్తుంది.
బ్యాంక్ అకౌంట్‌ను ఎందుకు మూసివేస్తారు?
-ఏళ్ల పాటు బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించకపోతే క్లోజ్ చేసే అవకాశం -జీరో బ్యాలెన్స్ అకౌంట్‌గా ఎక్కువ కాలం పాటు ఉంచితే నిలిపివేసే ఛాన్స్ -చాలాకాలం పాటు ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించకపోయినా అకౌంట్‌ను నిలిపివేయవచ్చు -ఇక మోసపూరిత, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, లావాదేవీలు నిర్వహిస్తే అకౌంట్ నిలిపివేస్తారు
మీరు ఏం చేయాలి..?
-మీ అకౌంట్ నిలిపివేసినప్పుడు వెంటనే బ్యాంకును సంప్రదించి అందులోని నిధులను తీసుకోండి -ఏవైనా డైరెక్ట్ డిపాజిట్లు, ఆటోమేటిక్ విత్ డ్రాలు పెట్టుకుంటే వాటిని రద్దు చేసుకోండి -వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు
అకౌంట్‌ను మూసివేయకుండా ఉండాలంటే..?
-అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేయండి -ఈకేవైసీ ప్రక్రియ ఎప్పటికప్పుడు పూర్తి చేయండి -మినిమం బ్యాలెన్స్ నిధులు అకౌంట్‌లో మెయింటైన్ చేయండి -మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు పొందేందుకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ సబ్‌స్కైబ్ చేసుకోండి -నెలవారీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తప్పనిసరిగా చూసుకోవాలి
