AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low CIBIL Score: తక్కువ సిబిల్ స్కోర్ ఉందా? అయినప్పటికీ ఈజీగా లోన్ పొందొచ్చు.. ఈ టిప్స్ మీకోసమే..

Personal Loan: అత్యవసరం అయినప్పుడు, తప్పనిసరి అయినప్పుడు.. ఇతరుల నుంచి రుణాలు తీసుకుంటారు. అయితే, బయటి వ్యక్తుల నుంచి తీసుకునే రుణానికి వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇక రుణం అధికంగా అవసరమైతే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సహాయంతో లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.

Low CIBIL Score: తక్కువ సిబిల్ స్కోర్ ఉందా? అయినప్పటికీ ఈజీగా లోన్ పొందొచ్చు.. ఈ టిప్స్ మీకోసమే..
Personal Loan
Shiva Prajapati
|

Updated on: May 29, 2023 | 3:10 PM

Share

అత్యవసరం అయినప్పుడు, తప్పనిసరి అయినప్పుడు.. ఇతరుల నుంచి రుణాలు తీసుకుంటారు. అయితే, బయటి వ్యక్తుల నుంచి తీసుకునే రుణానికి వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇక రుణం అధికంగా అవసరమైతే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సహాయంతో లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. పరిమితి మేరకు రుణాలు మంజూరు చేస్తారు. ఇక సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్ ఇచ్చేందుకు నిరాకరిస్తాయి.

CIBIL స్కోర్ విషయానికి వస్తే.. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను ఉత్తమంగా పరిగణించబడుతుంది. CIBIL స్కోర్ 700 కంటే తక్కువ ఉన్నవారు వ్యక్తిగత రుణం పొందడం కష్టంగా ఉంటుంది. అయితే, CIBIL స్కోర్ 700 కంటే తక్కువ ఉన్నవారు, బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలనుకునే వారు కొన్ని టిప్స్‌ని పాటించడం ద్వారా రుణం తీసుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

CIBIL స్కోర్, క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉందా?

లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు క్రెడిట్ రిపోర్టును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. చాలా సార్లు క్రెడిట్ రిపోర్ట్ అప్‌డేట్ చేయడం జరుగదు. కొన్ని సందర్భాల్లో అందులో కొంత తప్పు ఉంటుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తే.. లోన్ తీసుకునే ముందు దానిని సరి చేసుకోండి.

ఇవి కూడా చదవండి

రుణాన్ని తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం ఉందని రుణదాతలకు భరోసా ఇవ్వండి..

మీ క్రెడిట్ రిపోర్ట్‌లో సరిదిద్దలేని లోపం ఉన్నట్లయితే, రుణాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని రుణదాతకు భరోసా కల్పించొచ్చు. క్రెడిట్ నివేదికలలో జీతం, పొదుపులు, నికర విలువ వివరాలు ఉండవు. అలాంటి పరిస్థితిలో.. రుణదాత కొంచెం ఎక్కువ వడ్డీ రేటుతో రుణం ఇవ్వడానికి అంగీకరించే అవకాశం ఉంది.

ఉమ్మడి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

CIBIL స్కోర్ తక్కువగా ఉంటే.. మీ తండ్రి, సోదరుడు, సోదరి లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడిగా లోన్ కోసం దరఖాస్తు చేయబోయే వ్యక్తి అధిక CIBIL స్కోర్‌ని కలిగి ఉండాలి. అటువంటి సందర్భాలలో, రుణదాత రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాత రుణాన్ని మంజూరు చేయవచ్చు.

తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోండి..

పైన పేర్కొన్న చిట్కాలు పని చేయకపోతే.. రెండవ మార్గంగా తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే, పెద్ద మొత్తంలో EMIని తిరిగి చెల్లించగల సామర్థ్యంపై రుణదాత అనుమానం కలిగి ఉంటారు. రుణం మొత్తం తక్కువగా ఉంటే, దాన్ని తిరిగి చెల్లించేలా బ్యాంకును ఒప్పించవచ్చు.

NBFC, ఫిన్‌టెక్ కంపెనీల నుండి రుణం..

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), ఫిన్‌టెక్ కంపెనీలు తక్కువ క్రెడిట్ స్కోర్ / తక్కువ CIBIL స్కోర్ ఉన్నప్పటికీ లోన్‌ను అందిస్తుంది. అయితే, వాటి వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు